spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలి? సరైన...

Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలి? సరైన టైం ఏది?

Pawan Kalyan Varahi Yatra
Pawan Kalyan Varahi Yatra

Pawan Kalyan Varahi Yatra: ఏపీలో యాత్రల రాజ‌కీయం న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఒక‌నేత పాద‌యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి తిరుగుతున్నారు. మ‌రోనేత వారాహి యాత్ర‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు. నేరుగా జ‌నంతో క‌లిసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. జ‌నం ఈతిబాధ‌ల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. జ‌నం భుజంతో భుజం క‌లిపి.. వారి అడుగులో అడుగు వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ప్ర‌జ‌ల్లోకి ఎప్పుడు వెళ్లాలి ? స‌రైన స‌మ‌యం ఏది ? అన్న చ‌ర్చ ఇప్పుడు జ‌రుగుతోంది.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర త్వ‌ర‌లో ప్రారంభంకానుంది. ఏపీ మొత్తం తిరిగేందుకు జ‌న‌సేనాని స‌మాయత్తం అవుతున్నారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల్ని చేసే కార్య‌క్ర‌మాన్ని భుజానికెత్తుకున్నారు. ఏపీలో మార్పు సాధించ‌డం కోసం ప్ర‌తిన బూనారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర ప్ర‌క‌ట‌న‌తో అధికార పార్టీలో వ‌ణుకుపుట్టింది. వారాహి యాత్ర‌ను అడ్డుకుంటామ‌ని ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాలు ప‌లికింది. చివ‌రికి నాలుక మ‌డ‌తేసింది. మేం అలా అన‌లేందంటూ త‌ప్పించుకుంది. అధికార పార్టీ మాట‌ల‌ను చూస్తే వారాహి అంటే ఎంత భ‌య‌మో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఏపీలో నారా లోకేష్ ఇప్ప‌టికే పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. జ‌నంలో తిరుగుతున్నారు. అధికార పార్టీ పై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వైసీపీ కూడా పెట్టాల్సిన ఇబ్బందుల‌న్నీ పెడుతోంది. పాద‌యాత్రకు ఎక్క‌డికక్క‌డ ఆటంకాలు క‌లిగిస్తోంది. లోకేష్ పాద‌యాత్ర‌కు జ‌నం వ‌స్తున్నా.. అనుకున్న స్థాయిలో వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డంలేదు. ఎక్కువగా టీడీపీ కార్య‌క‌ర్త‌లే యాత్ర‌లో క‌నిపిస్తున్నారు. కానీ సామాన్యం జ‌నం నుంచి పెద్ద‌గా స్పంద‌న వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డంలేదు. దీనికి కార‌ణం టీడీపీ ఇప్ప‌టికే అధికారంలో ఉండటం. చంద్ర‌బాబు పాల‌ను అనేకసార్లు ప్ర‌జ‌లు చూడ‌టం అని చెప్ప‌వ‌చ్చు. కొత్త‌గా లోకేష్ ఇస్తున్న హామీలు కూడా ఏమీ క‌నిపించ‌డంలేదు.

Pawan Kalyan Varahi Yatra
Pawan Kalyan Varahi Yatra

లోకేష్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న అంతంత మాత్ర‌మే ఉన్న స‌మ‌యంలో .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర గురించిన చ‌ర్చ జోరందుకుంది. వారాహి త్వ‌ర‌లో ప్ర‌జ‌ల్లోకి రానుంది. లోకేష్ పాద‌యాత్ర త‌రహాలో వారాహి యాత్ర‌కు పెద్ద‌గా స్పంద‌న లేక‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంది. కాబ‌ట్టి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆచితూచి అడుగువేయాల్సిన ప‌రిస్థితి ఉంది. ప్ర‌ధానంగా ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు ? అన్న అంశం పై అధ్య‌య‌నం చేయాలి. అప్పుడు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి హామీ ఇవ్వాల‌న్న స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తద్వార ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెలుచుకునే అవ‌కాశం ఉంటుంది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రూపంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఒక మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ప్ర‌జ‌ల మూడ్ ఏంట‌నేది అర్థ‌మ‌వుతుంది. దీంతో ప్ర‌జ‌ల్లోకి ఎలా వెళ్లాలి ? ఎలాంటి హామీలు ఇవ్వాలి ? ప‌్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎలా పొందాలి ? అన్న విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం మంచిద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. గెలిస్తే ఏం చేస్తామో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. జ‌గ‌న్ కు భిన్నంగా మెరుగ్గా ఏం చేస్తామో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సి ఉంటుంది. అప్పుడే వారాహి యాత్ర అనుకున్నట్టు విజ‌యం సాధిస్తుంది.

 

దేశంలో ప్రథమ స్థానం, ఆంధ్రాలో అధమ స్థానం | Analysis on BJP Situation in AP | View Point | Ok Telugu

 

 

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version