https://oktelugu.com/

Sirivennela SeetharamaSastry Trivikram: దర్శకుడు త్రివిక్రమ్.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి వరుసకు ఏమవుతాడు?

Sirivennela SeetharamaSastry Trivikram: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం టాలీవుడ్ ను శోకసంద్రంలో ముంచెత్తింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఆయన మరణానికి నివాళులర్పిస్తున్నారు. ఆయనతో బంధాన్ని తలుచుకొని బాధపడుతున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా దర్శకుడు త్రివిక్రమ్ బాధపడుతున్నాడు. ఆయన ప్రతీ సినిమాలో ‘సిరివెన్నెల’ పాట ఉంటుంది. అయితే అంతకుమించిన బంధుత్వం వీరి మధ్య ఉంది. ఇంతకీ సిరివెన్నెలకు త్రివిక్రమ్ ఏమవుతారు? వారి మధ్య బంధుత్వం ఏంటనేది చాలా మందికి తెలియదు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2021 / 08:49 AM IST
    Follow us on

    Sirivennela SeetharamaSastry Trivikram: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం టాలీవుడ్ ను శోకసంద్రంలో ముంచెత్తింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఆయన మరణానికి నివాళులర్పిస్తున్నారు. ఆయనతో బంధాన్ని తలుచుకొని బాధపడుతున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా దర్శకుడు త్రివిక్రమ్ బాధపడుతున్నాడు. ఆయన ప్రతీ సినిమాలో ‘సిరివెన్నెల’ పాట ఉంటుంది. అయితే అంతకుమించిన బంధుత్వం వీరి మధ్య ఉంది. ఇంతకీ సిరివెన్నెలకు త్రివిక్రమ్ ఏమవుతారు? వారి మధ్య బంధుత్వం ఏంటనేది చాలా మందికి తెలియదు.

    Sirivennela Seetharama – Sastry Trivikram

    సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోయారు. క్యాన్సర్ తో ఊపిరితిత్తులు కోల్పోయి శరీరమంతా ఇన్ ఫెక్షన్ సోకడంతో ఆయన మరణించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు.

    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాల్లో కూడా అవే భావాలు కనిపిస్తాయి. అసలు త్రివిక్రమ్ కు సిరివెన్నెల గారికి మధ్య ఉన్న బంధుత్వం ఏంటీ అన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. వీరిద్దరూ కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

    ఇండస్ట్రీలో మొదటి నుంచి త్రివిక్రమ్ ప్రతిభను, మంచితనాన్ని గమనిస్తూ వచ్చిన సిరివెన్నెల.. తన తమ్ముడి కూతురును ఇచ్చి త్రివిక్రమ్ కు పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే సిరివెన్నెల గారి ఇంట్లోనే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు.

    Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల మృతి నన్నెంతగానో బాధించింది అంటున్న… ప్రధాని నరేంద్ర మోదీ

    అయితే సిరివెన్నెల తమ్ముడి పెద్ద కూతురును ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. కానీ త్రివిక్రమ్ కు పెళ్లిచూపుల్లో ఆమె చెల్లెలు నచ్చింది. ఇదే విషయాన్ని సిరివెన్నెలకు చెప్పాడట.. సిరివెన్నెల తమ్ముడు ఈ విషయంపై కోప్పాడ్డారట..

    అయితే త్రివిక్రమ్ పద్ధతి, వ్యవహారశైలి, ముక్కుసూటితనం నచ్చి ఎలాగైనా అల్లుడిని చేసుకోవాలనే ఉద్దేశంతో సిరివెన్నెల స్వయంగా తన సోదరుడికి నచ్చచెప్పి ఒప్పించారట.. అలా సిరివెన్నెలకు త్రివిక్రమ్ అల్లుడు అయ్యాడు. తన తమ్ముడు కూతురు సౌజన్యను ఇచ్చి వివాహం చేశారు. ఈ మామ-అల్లుళ్ల బంధం ఇప్పటికీ కొనసాగుతోందట..

     

    Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల మృతిపై బాధాతప్త హృదయంతో భారీ లేఖను పోస్ట్ చేసిన చిరంజీవి…