
Tarakaratna- Karimnagar: నందమూరి తారకరత్న మరణం యావత్తు సినీ లోకాన్ని , రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.గత 23 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన కచ్చితంగా ప్రాణాలతోనే బయటపడుతాడని అందరూ ఆశించారు, కానీ చివరికి ఇలా జరుగుతుందని మాత్రం ఎవ్వరు ఊహించలేకపోయారు.నటుడిగా మరియు రాజకీయ నాయకుడిగా దూసుకుపోతున్న తారకరత్న, జీవితం లో ఇంకా ఎన్నో చూడాల్సినవి మిగిలి ఉండగానే ఇలా జరగడం అనేది అందరి మనసులను కలిచివేస్తుంది.
ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ ఒక్కరితో తారకరత్న కి ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది,అందరినీ ఎంతో ప్రేమగా పలకరించేవాడు.రాజకీయంగా తెలుగు దేశం పార్టీ లో ఉన్నప్పటికీ కూడా ఇతర పార్టీల నాయకులూ కూడా తారకరత్న ని అభిమానిస్తారు.అంత మంచి పేరు అతని సొంతం, ఎలాంటివో వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది దురదృష్టకరం.
ఇది ఇలా ఉండగా తారకరత్న కి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాతో ఎంతో సన్నిహిత్య సంబంధం ఉండేది.ఎందుకంటే పెద్దపల్లి గ్రామం లో ఉన్న మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ లో తారకరత్న ECE డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ కోర్స్ ని పూర్తి చేసారు./సినీ నటుడు అయిన తర్వాత కూడా తారకరత్న ఎన్నో సందర్భాలలో ఆ కాలేజీ ని సందర్శించాడు.

ఆ కాలేజీ కి తన తరుపున నుండి ఏ చిన్న సహాయం అవసరమైన కాదనకుండా చేసి పెట్టేవాడు.అలాంటి వ్యక్తి చనిపోవడం పై కాలేజీ యాజమాన్యం తీవ్రమైన దిగ్బ్రాంతి ని వ్యక్త పర్చింది.ఆ కళాశాల చైర్మన్ ఎడవల్లి నవీన్ కుమార్ తారకరత్న తో తనకి ఉన్న అనుబంధం ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టాడు.అనంతరం తారకరత్న చిత్ర పటం కి పూలమాల వేసి నివాళులు అర్పించాడు.