NTR’s luxurious house : ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఇకపై ఆయన రెమ్యూనరేషన్ దాదాపు 100 కోట్లు ఉంటుంది. కొరటాల సినిమాకు ఆయన అంత మొత్తం తీసుకుంటున్నారని టాక్. మరి సినిమాకు వంద కోట్లు తీసుకునే ఎన్టీఆర్ ఇల్లు ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఎన్టీఆర్ లగ్జరీ హౌస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఫ్యామిలీతో ఆయన గడిపిన అందమైన క్షణాలు ఎన్టీఆర్ కెమెరాలో బంధించారు. క్రమంలో ఆయన లగ్జరీ హౌస్ పరిసరాలు, ఇంటీరియర్ ఫ్రేమ్ లోకి వచ్చాయి. ఎన్టీఆర్ ఇంటి వివరాలు పరిశీలిస్తే….

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 29లో ఎన్టీఆర్ హౌస్ ఉంది. ఈ ఇంటిని మోడరన్, యాన్సియెంట్ మోడల్స్ కలయికగా రూపొందించారట. స్విమ్మింగ్ పూల్, జిమ్, లైబ్రరీ, హోమ్ థియేటర్ వంటి అత్యాధునిక హంగులన్నీ ఉన్నాయట. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ తో పాటు వెల్ పర్నిష్డ్ హోమ్ అని తెలుస్తుంది. ఇంటి ఆవరణలో చక్కని గార్డెన్, అందులో సాయంత్రం వేళ చల్లగా సేద తీరేందుకు ఊయల ఉన్నాయట. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ ఇంటి విలువ రూ. 25 కోట్లకు పైమాటే అంటున్నారు.

ఇక లగ్జరీ కార్లు, బైక్స్ సేకరించడం ఎన్టీఆర్ కి ఫ్యాషన్. ఆయన వద్ద బెంజ్, రేంజ్ రోవర్, ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే హై సీసీ ఫారిన్ బైక్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిసిన ప్రస్తుత సమాచారం ఇది. కాగా ప్రజెంట్ ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నారు. కుటుంబంతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అక్కడకు వెళ్లడం జరిగింది. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ తన వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తున్నారు.

అమెరికా నుండి రాగానే ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ మూవీలో బిజీ కానున్నారు. జనవరిలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభిస్తారట. ఫిబ్రవరి లేదా మార్చ్ నుండి నిరవధికంగా షూటింగ్ జరపనున్నారట. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఎన్టీఆర్ 30 వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. 2018 తర్వాత నాలుగేళ్లలో ఎన్టీఆర్ చేసింది ఒక్క ఆర్ ఆర్ ఆర్ మాత్రమే. కొరటాల మూవీ అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తారు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.