EL Nino Effect: భూతాపం పెరుగుతోంది. వాతావారణంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. హిమనీ నదాల మట్టం పెరుగుతుండటంతో సముద్రాల్లో కూడా నీటి శాతం ఎక్కువవుతోంది. దీంతో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో వాతావరణంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి ప్రభావాలు ఉంటున్నాయి. దీంతో వ్యవసాయం దెబ్బతింటోంది.
ఎల్ నినో, లానినో
ఎల్ నినో అంటే వర్షాభావ పరిస్థితులు రావడం. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తర భారతదేశంలో వరదలు పెరుగుతున్నాయి. దక్షిణంలో మాత్రం పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఏం తోచడం లేదు. దక్షిణాది రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు సాగడం లేదు. ఇప్పటి వరకు ఇంకా విత్తనాలు పెట్టడమే పూర్తి కాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది.
రాబోయే రోజుల్లో..
రాబోయే రోజుల్లో ఎల్ నినో, లానినో తీవ్ర పరిణామాలు చూపిస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆధారాలు చూస్తుంటే ఎల్ నినో ఇంకా బలపడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వర్షపాతం పెరుగుదల, తగ్గుదల వల్ల పరిస్థితుల్లో భారీ తేడాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి.
భవిష్యత్ లో కరువు
భవిష్యత్ లో కరువు కాటకాలు సంభవించే ప్రమాదముంది. తీవ్రమైన కరువు రానుంది. దీంతో మానవుల మనుగడపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఆకలి ావులు కూడా ఉంటాయని అంటున్నారు. పర్యావరణం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ పరిస్థితులు చూస్తే మనకు కరువు చాయలు కనిపిస్తూనే ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల మనం తీవ్రంగా నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి.