
IBomma: రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సినిమాలు.. అవీ హై క్వాలిటీ వీడియోలు.. నిమిషాల్లో సినిమా మొత్తం డౌన్లోడ్.. ఇంత మంచి బంఫర్ ఆఫర్ ఇస్తున్న ‘ఐ బొమ్మ’ వెబ్ సైట్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు. మూరుమూల గ్రామాల్లోని యువత సైతం దీనిని ఆశ్రయిస్తున్నారనడంలో ఆశ్చర్యం వేయక మానదు. అయితే ఇటీవల ఐబొమ్మ సైట్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రచారం సాగింది. ఆ తరువాత మళ్లీ సెట్ చేశారు. ఇప్పుడు మళ్లీ సైట్ ఓపెన్ కావడం లేదని అంటున్నారు. ఇంతకీ ఐబొమ్మకు ఏమైంది? అన్న చర్చ సాగుతోంది.
ఈ కాలంలో కుటుంబంతో సినిమాలు చూడాలంటే జేబు గుళ్ల అవుతోంది. వేల రూపాయలు పెట్టి థియేటర్లకు వెళ్దామన్న కొందరికీ తీరిక ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని ఓటీటీ సంస్థలు సినిమాలను ప్రసారం చేయడం మొదలు పెట్టాయి. దీంతో చాలా మంది థియేటర్లకు వెళ్లడం మానేశారు. అయితే ఓటీటీలో సినిమా చూడాలంటే సబ్ స్క్రిప్షన్ కు కొంత మొత్తం చెల్లించాలి. అప్పుడే హెచ్ డీ క్వాలిటీతో సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. కొందరు ఇలా సబ్ స్క్రిప్షన్ చేసుకొని ఆ లింక్ ను షేర్ చేసుకునేవారు.
అయితే రూపాయి ఖర్చు లేకుండా, నిమిషాల్లోనే హెడ్ క్వాలిటీ సినిమాలను ‘ఐ బొమ్మ’ అందిస్తోంది. ఈ వెబ్ సైట్ లోని సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి పెద్దగా ప్రాసెస్ కూడా లేకపోవడంతో చాలా మంది దీనిని ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరు ఓటీటీ నిర్వాహకులు ఈ వెబ్ సైట్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఐబొమ్మ తో ఓటీటీలను ఎవరూ సబ్ స్క్రిప్షన్ చేసుకోవడం లేదని ఆందోళన చెందారు. దీంతో గతంలో కొన్ని రోజుల పాటు ఈ సైట్ కనిపించలేదు.

ఆ తరువాత కొందరు హ్యాకర్లు ‘ఐబొమ్మ’ లొగో పెట్టి నకిలీ సైట్ ను తయారు చేశారు. దీంతో చాల మంది వినియోగదారులు ఈ సైట్లను క్లిక్ చేయడంతో తమ మొబైల్స్ హ్యాంగ్ అయ్యాయి. ఆ తరువాత ఇక ఐబొమ్మ లేనట్లే అని అనుకున్న సమయంలో ఆ వెబ్ సైట్ నిర్వాహకులు కొన్ని మార్పులు చేసి మరోసారి అందుబాటులోకి తెచ్చారు. అయితే లేటేస్టుగా మరోసారి ఈ సైట్ ఇబ్బందులకు గురి చేస్తుందని కొందరు వాపోతున్నారు. ఇలా మధ్య మధ్యలో సైట్ ప్రాబ్లం రావడంతో అసలు ‘ఐబొమ్మ’కు ఏమైంది? అన చర్చించుకుంటున్నారు.