https://oktelugu.com/

Medico Preethi : ప్రీతి కేసులో టాక్సికాలజీ రిపోర్ట్‌ ఏం చెబుతోంది? జటిలమవుతున్న మెడికో కేసు

Medico Preethi : డాక్టర్‌ ప్రీతి మృతి అంశం నానాటికీ జటిలం అవుతోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రీతి ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట.. మిడాజోలం, పెంటానోల్‌ అనే మత్తు ఇంజెక్షన్‌లు పడి ఉన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. కానీ.. ‘‘ప్రీతి శరీరంలో ఎలాంటి విషాలు లేవు’’ అంటూ టాక్సికాలజీ నివేదిక వచ్చింది.. ప్రీతి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం, ఆమెది హత్యనేనని రాజకీయ పార్టీలు, […]

Written By:
  • Rocky
  • , Updated On : March 7, 2023 / 10:43 PM IST
    Follow us on

    Medico Preethi : డాక్టర్‌ ప్రీతి మృతి అంశం నానాటికీ జటిలం అవుతోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రీతి ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట.. మిడాజోలం, పెంటానోల్‌ అనే మత్తు ఇంజెక్షన్‌లు పడి ఉన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. కానీ.. ‘‘ప్రీతి శరీరంలో ఎలాంటి విషాలు లేవు’’ అంటూ టాక్సికాలజీ నివేదిక వచ్చింది.. ప్రీతి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం, ఆమెది హత్యనేనని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తూ విచారణకు పట్టుబడుతున్న నేపథ్యంలో వరంగల్‌ పోలీసులు. ఎవరైనా హత్య చేశారా? ఆత్మహత్య చేసుకుందా? గుండెపోటుతో మరణించిందా? అని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రీతి పోస్టుమార్టం రిపోర్టు, మొబైల్‌ ఫోన్‌ ఫోరెన్సిక్‌ రిపోర్టులను తెప్పించే పని లో ఉన్నారు. ప్రీతి ఫోన్‌ సంభాషణలు, మెసేజ్‌లు, హెచ్‌వోడీకి ఫిర్యాదు చేయడం సహా ఇతరత్రా అన్ని ఆధారాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు.

    ఆ కోణంలో దర్యాప్తు

    ప్రీతిని ఎవరైనా హత్య చేస్తే.. వారికి ఎందుకంత పగ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతి అపస్మారక స్థితికి వెళ్లే ముందు అనుమానితులు, ముఖ్యంగా డాక్టర్‌ సైఫ్‌ సెల్‌ టవర్‌ లోకేషన్‌, అతడి ఇంటి నుంచి ఆస్పత్రి వరకు ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ సేకరించారు. మరో వైపు ప్రీతి ఆత్మహత్యకు పాల్పడేంతటి బలహీన మనస్కురాలు తెలుస్తోంది. పోలీసులు సేకరించిన ఆధారాలు సైతం దీన్నే బలపరుస్తున్నారు. కాగా, అనస్థీషియా పీజీ విద్యార్థులు రోగుల కోసం తీసుకునే ఇంజక్షన్లకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఫెంటనిల్‌ అనే ఇంజక్షన్‌ వివరాలను నమోదు చేసేందుకు డాక్టర్‌ ప్రీతి దగ్గర ఖాళీ యాంపిల్‌ తీసుకువచ్చేందుకు నర్సు విజయలక్ష్మి వెళ్లింది. అయితే, అప్పటికే ప్రీతి విగతజీవిగా పడి ఉంది. అయితే ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి తనకు తానుగా ఇంజక్షన్‌ ఇచ్చుకోవడం సాధ్యం కాదని తెలుస్తోంది. మరో వైపు. ప్రీతి గుండెపోటుతో చనిపోయిందన్న వాదన కూడా వినిపిస్తోంది ‘మానసిక ఒత్తిడితో గుండెపోటు వచ్చిందా? ఈ ఒత్తిడి కూడా డాక్టర్‌ సైఫ్‌ వల్లనే కలిగిందా?’ అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

    టాక్సికాలజీ శాంపిల్స్‌ ఎప్పుడు తీయాలి?

    వ్యక్తి తెలియని డ్రగ్స్‌, విషం తీసుకున్నప్పుడు వెంటనే అపస్మారక స్థితికి వెళతారు. సయమం వృఽథా చేయకుండా తక్షణమే వారి నమూనాలు సేకరించి టాక్సికాలజీకి పంపుతారు. ఈ నమూనాలను గంటల వ్యవధిలోనే సేకరించాలని ఫార్మకాలజిస్టులు చెబుతున్నారు. వీలైతే 24 గంటలలోపే చేయాలని అంటున్నారు. ఆలస్యమయ్యే కొద్ది విష ప్రభావం ఎంతో తెలియదని పేర్కొంటున్నారు. కాగా, విష ప్రయోగం జరిగిన సందర్భాల్లో, ఆత్మహత్య కేసుల్లోనూ పోలీసులు టాక్సికాలజీ రిపోర్టును కీలకంగా భావిస్తారు. అందుకే మెడికో లీగల్‌ కేసుల్లో ఎక్కువగా ఈ రిపోర్టుపై ఆధారపడతారు. టాక్సికాలజీ నివేదికలో శరీరంలో ఎటువంటి విష పదార్థాలు లేవని నిర్థారణ అయితే పోస్టుమార్టం నివేదికపై దృష్టిసారిస్తారు.

    ఎందుకు చేస్తారు?

    ప్రీతి కేసు నేపథ్యంలో.. ‘‘టాక్సికాలజీ’’ పరీక్ష చర్చనీయాంశం అవుతోంది. అసలు ఇది ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమీ తేలకపోతే అంతకుమించిన పరీక్షలు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. వ్యక్తి తీసుకున్న విషం ఏమిటో తెలియని సందర్భంలో టాక్సికాలజీ పరీక్ష చేస్తారు. రక్త, మూత్ర, లాలాజలం, మలానికి సంబంధించిన ఏదో ఒక నమూనాను సేకరించి పరీక్షకు పంపుతారు. శరీరంలో ఆ విషం తాలూకు కాన్‌సెంట్రేషన్‌ లెవల్స్‌ గుర్తిస్తారు. తీసుకున్న విషం లాంగ్‌, షార్ట్‌ లైఫ్‌కు చెందినదా అని తేలుస్తారు. రసాయనాలు శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి? మెటాబాలిజం, విసర్జితం ఎలా అవుతాయో టాక్సికాలజీ చెబుతుంది. విషం మూలం, ప్రభావం, దాని చికిత్స అధ్యయనమే టాక్సికాలజీ. విషం అవయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? పనిచేయకుండా ఎలా దెబ్బతీస్తుంది అన్నది టాక్సికాలజీలో తెలుస్తుంది. తీసుకున్న మోతాదు ఎంత? అవయవాలపై ప్రభావం ఎంత అన్నదాన్ని టాక్సికాలజీ నివేదికతో గుర్తిస్తారు.