Surekha Vani: సురేఖా వాణి ఇంస్టాగ్రామ్ రీల్ వైరల్ గా మారింది. మగతనం అంటూ కొంచెం బోల్డ్ పదాలు వాడుతూ ఆమె చేసిన వీడియో రచ్చ చేస్తుంది. ఈ తరం లేడీ కమెడియన్స్ లో సురేఖా వాణి ఒకరు. విజయవాడకు చెందిన ఈ బోల్డ్ బ్యూటీ గ్లామరస్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు. టైం బాగోక ఇలా మిగిలిపోయింది కానీ… స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఏలాల్సింది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సురేఖా వాణి వెండితెరకు ప్రమోట్ అయ్యారు.
దర్శకుడు శ్రీను వైట్ల ఈమెను ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో సురేఖా వాణి చేసిన పాత్రలు బాగా గుర్తింపు తెచ్చాయి. రెడీ, దుబాయ్ శ్రీను, నమో వెంకటేశా, బాద్ షా చిత్రాల్లో సురేఖా వాణి చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. 2019లో ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది. భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు . ఆ టైం లో కొంచెం గ్యాప్ తీసుకుంది. తర్వాత లాక్ డౌన్ వచ్చింది. దీంతో సురేఖా వాణి సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. మేకర్స్ కూడా ఆమెను పట్టించుకోవడం మానేశారు.
ఒకప్పటిలా ఆమెకు విరివిగా ఆఫర్స్ రావడం లేదు. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. టాలీవుడ్ నన్ను పక్కన పెట్టేసింది. గతంలో మాదిరి అవకాశాలు ఇవ్వడం లేదని సురేఖా వాణి నేరుగానే తన అసహనం బయటపెట్టారు. అయితే సోషల్ మీడియాలో ఆమె సందడి ఎక్కువైంది. హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ రీల్ వైరల్ గా మారింది. వైఎస్ఆర్ టీపీ నేత షర్మిల కామెంట్స్ కి సురేఖా వాణి రీల్ చేశారు. షర్మిల ఇటీవల ‘ఆయన మగతనం గురించి నాకెందుకండీ? ఆయన, వాళ్ళ ఆవిడ చూసుకుంటే సరిపోతుంది’ అని ఒక పొలిటికల్ కామెంట్ చేశారు.
షర్మిల చెప్పిన మాటలకు సురేఖా వాణి రీల్ చేసి ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. కాగా సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఫేమస్. అందంలో అమ్మకు ఏమాత్రం తగ్గని ఈ యుంగ్ బ్యూటీ అప్పుడే నెటిజన్స్ ని ఊపేస్తోంది. సుప్రీతను హీరోయిన్ చేయాలని సురేఖా ఆశపడుతున్నారు.