Sudigali Sudheer- Nagababu: తనతోపాటు పనిచేసే వారికి బూస్ట్ నివ్వడం.. వెన్నుతట్టి ప్రోత్సహించడం నాగబాబుకు అలవాటు. అందుకే ‘జబర్ధస్త్’లో ఏదో ఒక ఇష్యూలో తనను నమ్ముకున్న వారి కోసం బయటకొచ్చి మాటీవీలో మరో కామెడీ షో నడిపించాడు. తనతోపాటు చమ్మక్ చంద్ర సహా పలువురు కమెడియన్లను బయటకు తీసుకొచ్చాడు. వారికి ఉపాధి చూపించాడు.

ఇక నాగబాబు ప్రోద్బలంతోనే సుడిగాలి సుధీర్ కూడా జబర్ధస్త్ నుంచి బయటకొచ్చి మా టీవీ ప్రోగ్రాంలు చేయడంతోపాటు సినిమాల్లోనూ బీజీగా మారాడు. ఈ క్రమంలోనే ఇటీవల పలు సినిమాలు తీస్తున్నాడు.
అయితే ఊహించని విధంగా సుధీర్ ఇటీవల నటించిన ‘గాలోడు’ మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి మంచి కలెక్షన్లు వచ్చాయి. సినిమాలేవీ లేని సమయంలో విడుదల కావడం.. సుధీర్ ఇందులో మాస్ హీరోగా ప్రొజెక్ట్ కావడం.. మంచి కథాంశం.. మాస్ మసాలాలు ఉండడంతో సినిమా ఆడేసింది.

గాలోడు హిట్ కావడంతో సుధీర్ ను తన వద్దకు పిలిపించుకొని మరీ ప్రశంసలు కురిపించాడు నాగబాబు. ‘గాలోడు’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.
ఈ సందర్భంగా 8 ఏళ్ల క్రితమే సుడిగాలి సుధీర్ మాస్ హీరో అవుతాడని జోస్యం చెప్పానని.. అది ఇప్పుడు నిజమైనందుకు సంతోషంగా ఉందని నాగబాబు తెలిపారు. ఎవరైతే కష్టపడుతారో వాళ్లను విజయం వరిస్తుందని.. హార్డ్ వర్క్ కంటిన్యూ చేయాలని సుధీర్ కు సూచించాడు. ఇలా సుధీర్ పై అభిమానాన్ని ఇప్పటికీ చాటుకుంటూ నాగబాబు అందరివాడుగా ఉన్నాడు.