https://oktelugu.com/

Lawrence- Chiranjeevi: అప్పటి ముచ్చట్లు : ముఠామేస్త్రీ సినిమా టైంలో డ్యాన్సర్ల లో చివరన ఉన్న లారెన్స్ ను చిరంజీవి గుర్తించి..

Raghava Lawrence- Chiranjeevi: అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరానికి ఎదిగేందుకు సినిమా ఇండస్ట్రీ మంచి మార్గం. పొట్ట చేతులో పట్టుకుని ఫీల్డ్ కు వచ్చిన వారు ఇప్పుడు పది మందికి అన్నం పెడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి కృషి, పట్టుదల కూడా ఉండాలి. ఇదే సమయంలో కొందరి ప్రోత్సాహం ఉండాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కింది స్థాయి నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నూతన నటులను ప్రోత్సహిస్తారని అంటుంటారు. ఆయన సాయంతో ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 12, 2023 / 10:17 AM IST
    Follow us on

    Raghava Lawrence- Chiranjeevi

    Raghava Lawrence- Chiranjeevi: అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరానికి ఎదిగేందుకు సినిమా ఇండస్ట్రీ మంచి మార్గం. పొట్ట చేతులో పట్టుకుని ఫీల్డ్ కు వచ్చిన వారు ఇప్పుడు పది మందికి అన్నం పెడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి కృషి, పట్టుదల కూడా ఉండాలి. ఇదే సమయంలో కొందరి ప్రోత్సాహం ఉండాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కింది స్థాయి నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నూతన నటులను ప్రోత్సహిస్తారని అంటుంటారు. ఆయన సాయంతో ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది ప్రముఖ నటులుగా కొనసాగుతున్నారు. వారిలో డ్యాన్సర్ లారెన్స్ ఒకరు. చిరంజీవి ఇచ్చిన పుష్ అప్ తోనే తాను డైరెక్టర్ స్థాయికి ఎదిగానని పలు సందర్భాల్లో చెప్పారు. మరి లారెన్స్ ను చిరంజీవి ఎలా ప్రోత్సహించారంటే?

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చాయి. కానీ ‘ముఠామేస్త్రీ’ మూవీ మైలురాయిగా నిలుస్తుంది. ఊర మాస్ లెవల్లో వచ్చిన ఈ సినిమాకు ఎ కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఇందులో చిరంజీవితో పాటు రోజా, మీనాలు నటించారు. ఇందులో చిరంజీవి యాక్షన్ ఆల్ రౌండర్ అన్నట్లు ఉంటుంది. కథ పరంగానే కాకుండా రాజ్ కోటి సంగీతంలో పాటలు మంచి ఊపునిస్తాయి. ముఖ్యంగా చిరంజీవి ఎంట్రీ ఇచ్చే ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’ అనే సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. ఈ సాంగ్ ఇప్పటికీ కొన్ని చోట్ల వినిపిస్తుంది.

    Raghava Lawrence- Chiranjeevi

    ఈ సాంగ్ లో చిరంజీవితో పాటు కొంతమంది డ్యాన్సర్లు నృత్యం చేస్తారు. ఇందులో ఐదో వరుసలో మనం లారెన్స్ ను నిశితంగా పరిశీలిస్తే తప్ప కనిపించరు. ఆ సమయంలో చిరంజీవితో పాటు లారెన్స్ చేసిన డ్యాన్స్ చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. దీంతో అప్పటి నుంచి లారెన్ష్ ను చిరంజీవి ప్రోత్సహించేవారు. డ్యాన్స్ లో నీకు ఎంతో ప్రతిభ ఉంది.. తప్పకుండా నువ్వు స్టార్ డ్యాన్సర్ అవుతావు.. అని అనేవారట. అలా మెగాస్టార్ ఎంకరేజ్మెంట్ తో లారెన్స్ టాలీవుడ్ లో బిగ్ డ్యాన్సర్ గా మారి.. ఆ తరువాత స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించారు.

    డ్యాన్సర్ గానే కాకుండా నటుడిగా ,డైరెక్టర్ గా లారెన్స్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తీసిన స్టైల్ సినిమాలో చిరంజీవిని గెస్ట్ రోల్ గా ఆహ్వానించిన విషయం తెలిసిందే. లారెన్స్ నటించిన లేటేస్ట్ మూవీ ‘రుద్రుడు’ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ చిరంజీవి గురించి పలు ఆసక్తి విషయాలు చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.