https://oktelugu.com/

Chat GPT – Telangana Secretariat : తెలంగాణ సచివాలయం గురించి “చాట్ జిపిటి” ఏం చెప్పిందంటే?

తెలంగాణ సచివాలయ నిర్మాణం ఓ ఇండియన్ మార్వెల్. ఆగ్రా లోని తాజ్ మహల్, ఢిల్లీ లోని లోటస్ టెంపుల్, కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్, ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా మాదిరి దీనిని ఐకానిక్ బిల్డింగ్ లాగా చెప్పవచ్చు

Written By:
  • Rocky
  • , Updated On : April 30, 2023 12:43 pm
    Follow us on

    Chat GPT – Telangana Secretariat : తెలంగాణ నూతన సచివాలయం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ సచివాలయానికి సంబంధించి కృత్రిమ మేధ టూల్ “చాట్ జిపిటి” సెర్చ్ ఇంజన్ కూడా సచివాలయానికి సంబంధించి పలు విశ్లేషణలు చేసింది.
    ఏం చెప్పిందంటే
    హైదరాబాద్ నడిబొడ్డున కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయింది. పాత సచివాలయాన్ని కూలగొట్టి దాని స్థానంలో దీన్ని నిర్మించారు. దేశంలో అతిపెద్ద సచివాలయం ఇది. దీని నిర్మాణం 2019లో ప్రారంభమైంది.. ప్రపంచాన్ని ప్రఖ్యాత భవంతుల్లో ఇది ఒకటి. 25 ఏకాల ప్రాంగణంలో దీని నిర్మించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి లో ఉన్న అధ్యక్షుడి అధికారిక నివాసం భవనం కంటే దీని విస్తీర్ణం ఎక్కువ.. పర్యావరణానికి అనుకూలంగా ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించారు. ఇండో పర్షియన్, కాకతీయ కాలాకృతులతో తీర్చిదిద్దిన లోపల భాగాలు, ఫాన్స్ లో 17వ శతాబ్దంలో నిర్మించిన వర్సేహిల్స్ ప్యాలెస్ కు దీటుగా ఉన్నాయి. ఇప్పటివరకు నిర్మించిన భవంతుల్లో ప్రపంచ వ్యాప్తంగా బుర్జ్ ఖలీఫా ది ప్రత్యేక స్థానం. కానీ మాదిరే తెలంగాణ కొత్త సచివాలయం ఉంది. ఇందులో అనేక సౌకర్యాలు కల్పించారు.
     ఇండియన్ మార్వెల్
    తెలంగాణ సచివాలయ నిర్మాణం ఓ ఇండియన్ మార్వెల్. ఆగ్రా లోని తాజ్ మహల్, ఢిల్లీ లోని లోటస్ టెంపుల్, కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్, ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా మాదిరి దీనిని ఐకానిక్ బిల్డింగ్ లాగా చెప్పవచ్చు. భారతదేశ చరిత్ర ను ఇనుమడింప చేసే భవనాలు ఎన్నో ఉన్నాయి. అందులో తెలంగాణ సచివాలయం కూడా ఒకటి. ఇక 1931లో న్యూయార్క్ సిటీలో నిర్మించిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కు 5,700 కోట్లు ఖర్చయింది. దానికైన ఎత్తైన నిర్మాణం తెలంగాణ సచివాలయం. దీనికి దాదాపుగా 1200 కోట్లు ఖర్చయింది.
    ఏమిటి ఈ చాట్ జీపీటీ?
    కృత్రిమ మేథ ఆధారంగా చాట్ జిపిటి తయారు చేశారు. ఇందులో చాట్ అనగా మాట్లాడటం.. జిపిటి అంటే జనరేటివ్ ఫ్రీ ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్.. అంటే ఈ చాట్ బోట్ కు ముందుగా శిక్షణ ఇస్తారు. ఒకప్పుడు విషయాలను కలపడం ద్వారా మనకు సాధారణ మనిషి ఇచ్చిన విధంగానే సమాధానాలు ఇచ్చేలా చాట్ జిపిటిని తీర్చిదిద్దారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద పరిశోధన చేస్తున్న శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ అనే కంపెనీ దీనిని ఆవిష్కరించింది. తెలంగాణ సచివాలయానికి సంబంధించి ప్రశ్నలు అడగగా చాట్ జీపీటీ పై విధంగా సమాధానాలు చెప్పింది.