https://oktelugu.com/

పవన్ కళ్యాణ్, బాలయ్య, వెంకటేశ్ నట వారసుల సంగతేంటి?

ఆ ఫ్యామిలీలో ఒక్క అగ్రహీరో ఉంటే చాలు.. అతడి చుట్టాలు, పక్కాలు, అల్లుల్లు, మనవళ్లు, టోటల్ ఫ్యామిలీ అంతా హీరోలు అయిపోవడం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ గా మారింది.. మెగాస్టార్ చిరంజీవి రాకతో ఆయన కుటుంబంలో దాదాపు డజను మంది హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత నందమూరి కుటుంబం నుంచి ముగ్గురు నలుగురు హీరోలు వచ్చారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నారు. అయితే మన ముగ్గురు స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2022 / 03:07 PM IST
    Follow us on

    ఆ ఫ్యామిలీలో ఒక్క అగ్రహీరో ఉంటే చాలు.. అతడి చుట్టాలు, పక్కాలు, అల్లుల్లు, మనవళ్లు, టోటల్ ఫ్యామిలీ అంతా హీరోలు అయిపోవడం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ గా మారింది.. మెగాస్టార్ చిరంజీవి రాకతో ఆయన కుటుంబంలో దాదాపు డజను మంది హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత నందమూరి కుటుంబం నుంచి ముగ్గురు నలుగురు హీరోలు వచ్చారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఉన్నారు.

    అయితే మన ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం తమ నట వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో తటపటాయిస్తున్నారు. బహుశా వారి కుమారులకు ఈ సినీ రంగంపై ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ.. టాలీవుడ్ లోకి మాత్రం వారి వారసుల రాక మాత్రం కనిపించడం లేదు.

    Also Read:  ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు క‌ట్టాలంట‌.. జ‌గ‌న్ పెద్ద ప్లానే వేశారే..!

     

    ముందుంగా అందరికంటే పెద్ద కుమారుడు ఉన్నది నటసింహం బాలయ్య బాబుకే.. బాలయ్య కుమారుడు మోక్షజ్జ సినీ రంగ ప్రవేశం అంటూ గత ఐదారేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య లాగానే మరో సింహం వస్తుందని ఆయన అభిమానులు ఆశ పడుతూనే ఉన్నారు. ఒక అగ్ర దర్శకుడు ఈయనను లాంచ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.కానీ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ మాత్రం సాగడం లేదు. మోక్షజ్ఞకు సినీ ఇండస్ట్రీపై ఆసక్తి లేదని.. అతడు చదువులు, ఉద్యోగం, లేదా సొంతంగా వ్యాపారం దిశగా వెళ్లాలనుకుంటున్నాడని.. అందుకే ఇటు వైపు చూడడం లేదని ఒక టాక్ నడుస్తోంది.

    ఇక విక్టరీ వెంకటేశ్ కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు అర్జున్. కూతుళ్లకు పెళ్లి చేసి సెట్ చేస్తున్న వెంకటేశ్ తన నట వారసుడు అయిన కుమారుడు అర్జున్ ను మాత్రం సినీ ఇండస్ట్రీకి దూరంగానే పెడుతున్నాడు. అతడితో చిన్నపిల్లల పాత్రలు కానీ.. ఏ ఇతర వీడియోలు, షార్ట్ ఫిలింస్ లలో కూడా కనిపించకుండా దాచేస్తున్నాడు. బహుషా వెంకటేశ్ కూడా తన వారసుడిగా అర్జున్ ను తీసుకురావడం ఇష్టం లేదో.. లేక అర్జున్ కే ఆసక్తి లేదో తెలియాల్సి ఉంది.

    Also Read: ‘భీమ్లానాయక్’కి U/A.. పైగా కేటీఆర్ కూడా రాబోతున్నాడు

    ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ బలం మరే హీరోకు లేదు. ఆయన నట వారసుడు అకీరా నందన్ ఇప్పటికే సినీ ఎంట్రీకి ఎదురుచూస్తున్నాడు. ఆయన తల్లి రేణుదేశాయ్ ఇప్పటికే నటనలో శిక్షణ కూడా ఇప్పిస్తోందట.. పవన్ తన కుమారుడు అకీరాను ఖచ్చితంగా హీరోను చేస్తాడని టాక్ నడుస్తోంది.

    ఇలా ముగ్గురు స్టార్ హీరోలు పవన్, బాలయ్య, వెంకటేశ్ లలో ప్రస్తుతానికి పవన్ కుమారుడే కాస్త సినిమాల వైపు ఆసక్తితో ఉన్నట్టు సమాచారం.

    Also Read:  యాడ్స్ ద్వారా మహేష్ సంపాదన ఎంత..? ఆ మొత్తం ఏం చేస్తాడో తెలుసా?

    Recommended Video: