https://oktelugu.com/

Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి షూటింగ్ కు వచ్చిన సాయిధరమ్ తేజ్ కు ఇది షాకింగ్

Sai Dharam Tej:  గత ఏడాది బైక్ యాక్సిడెంట్ కు గురైన సాయిధరమ్ తేజ్ నాడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. బైక్ అతివేగంగా నడిపారని.. మీడియాలో రాచి రంపాన పెట్టారు. నాడు సృహ కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోలు బయటకొచ్చి వైరల్ అయ్యాయి. ఇక మేనల్లుడు సాయిధరమ్ కోసం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి తదితరులు ఆస్పత్రికి తరలివచ్చి మరీ ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంవత్సరకాలంగా షూటింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2022 / 08:31 PM IST
    Follow us on

    Sai Dharam Tej:  గత ఏడాది బైక్ యాక్సిడెంట్ కు గురైన సాయిధరమ్ తేజ్ నాడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. బైక్ అతివేగంగా నడిపారని.. మీడియాలో రాచి రంపాన పెట్టారు. నాడు సృహ కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోలు బయటకొచ్చి వైరల్ అయ్యాయి.

    Sai Dharam Tej

    ఇక మేనల్లుడు సాయిధరమ్ కోసం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి తదితరులు ఆస్పత్రికి తరలివచ్చి మరీ ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంవత్సరకాలంగా షూటింగ్ లకు దూరంగా రెస్ట్ తీసుకున్న సాయిధరమ్ తేజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకున్నారు. తన కొత్త సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు.

    Also Read: AP Cabinet Expansion Date Fixed: కేబినెట్ విస్తరణ ముహూర్తం ఈనెల 11కు జగన్ ఫిక్స్ అయ్యారా?

    కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ఎస్.డీటీ 15’ వర్కింగ్ టైటిల్ తో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 28న ప్రారంభమైంది. తొలి రోజు షూటింగ్ కు సాయిధరమ్ తేజ్ రాగా ఆయనకు చిత్ర బృందం ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసింది.

    చిత్రం యూనిట్ చాలా మంది ‘వెల్ కమ్ బ్యాక్ సాయితేజ్’ అనే బోర్డులతో స్వాగతం పలికారు. మరికొందరు పూల వర్షం కురిపించారు. ఇంతటి ఘన స్వాగతాన్ని ఊహించని సాయిధరమ్ తేజ్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నారు.

    అనంతరం తనకు ఇంతటి స్వాగతం పలికిన చిత్రంయూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సెట్స్ కు నటులు వరుణ్ తేజ్, ఆర్.నారాయణమూర్తి అతిథులుగా మెరిశారు. ఈ వీడియో తాజాగా విడుదలైన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    Also Read: Naga Chaitanya With Nandini Reddy: చైతుకి సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ కి కావాలి

    ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్, బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో చిత్రం రూపొందుతోంది.