Allu Arjun Arrested: నేడు ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట లో చనిపోయిన రేవంతి అనే మహిళ కేసు విషయంలో అల్లు అర్జున్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన్ని అరెస్ట్ చేసి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన పోలీసులు, విచారణ జరిపిన తర్వాత గాంధీ ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి హై కోర్టు కి తరలించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ పై నాన్ బెయిల్ కేసు నమోదు అయ్యిందని, ఆయనకి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనంటూ సోషల్ మీడియా లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక వీడియో ని షేర్ చేసారు.
వరాల్లోకి వెళ్తే ‘పుష్ప 2’ చిత్రం విడుదలైన రెండు రోజులకు అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన ప్రత్యేకించి కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కి కృతఙ్ఞతలు తెలిపే సమయం లో రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోతాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అనేక విమర్శలు కూడా అల్లు అర్జున్ పై వచ్చాయి. దీనిని మనసులో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తన అహం దెబ్బ తినడంతో అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసాడని ‘యాక్షన్’, ‘రియాక్షన్’ పేరిట బీఆర్ఎస్ పార్టీ ఒక వీడియో ని సోషల్ మీడియా లో విడుదల చేసింది.
ఇది నిజమో కాదో తెలియదు కానీ, తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పై చాలా ఫైర్ మీద ఉంది అనే వాదన జనాల్లోకి బాగా వెళ్ళింది. కొంతకాలం క్రితమే అక్కినేని నాగార్జున కి సంబంధించిన N కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం పై అత్యంత నీచమైన కామెంట్స్ చేయడం, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించడం, ఇలా వరుసగా సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాదన కూడా కరెక్టే కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ బయటకి వచ్చిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి. ఆయనపై నాన్ బెయిల్ వారెంట్ నిజంగానే పడుతుందా లేదా అనేది కాసేపట్లో తేలనుంది.
అసలు రీజన్ ఇది #Pushpa2 #AlluArjun pic.twitter.com/Tws0JfPit7
— BRSTrending® (@BRSTrending) December 13, 2024