Sudigali Sudheer Deepika pilli : దీపిక పిల్లితో రోమాన్స్ చేసిన సుడిగాలి సుధీర్.. రష్మికి షాక్

Sudigali Sudheer Deepika pilli :  తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కమెడియన్ సుడిగాలి సుధీర్. ఒక మ్యూజిషియన్ గా అష్టకష్టాలు పడి జబర్ధస్త్ తో పాపులర్ అయిన సుధీర్ కు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు వచ్చి హీరోగానూ మారిపోయారు. యాంకర్ గా.. నటుడిగా.. మెజీషియన్ గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కనిపిస్తున్నారు. బుల్లితెరపై ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజిబిజిగా గడుపుతున్నారు. ఈరోజు సుధీర్ పుట్టినరోజు. […]

Written By: NARESH, Updated On : May 20, 2022 7:14 pm
Follow us on

Sudigali Sudheer Deepika pilli :  తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కమెడియన్ సుడిగాలి సుధీర్. ఒక మ్యూజిషియన్ గా అష్టకష్టాలు పడి జబర్ధస్త్ తో పాపులర్ అయిన సుధీర్ కు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు వచ్చి హీరోగానూ మారిపోయారు. యాంకర్ గా.. నటుడిగా.. మెజీషియన్ గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కనిపిస్తున్నారు. బుల్లితెరపై ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజిబిజిగా గడుపుతున్నారు. ఈరోజు సుధీర్ పుట్టినరోజు. ఆత్మీయులతో పాటు అభిమానులు సైతం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుధీర్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది.

సుధీర్ బర్త్ డే సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది. సినిమాలోని సుధీర్ క్యారెక్టర్ కు సంబంధించిన వీడియో ఇదీ..

ఈ వీడియోలో సుధీర్.. యాంకర్ పిల్లి దీపికతో కలిసి ఉన్న ఓ పాటకు సంబంధించిన షాట్ తో పాటు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుతో కలిసి ఉన్న మరో షాట్ ను షేర్ చేశారు.

మొదటి షాట్ లో సుడిగాలి సుధీర్, యాంకర్ దీపిక కలిసి ఓ రోమాంటిక్ సాంగ్ చేయడం కనిపించింది. మరి వీరి రోమాన్స్ ను సుధీర్ గర్ల్ ఫ్రెండ్ రష్మీ చూస్తే తట్టుకుంటుందా? సుధీర్ కు మొట్టికాయలు వేసి ఆగ్రహం వ్యక్తం చేస్తుందా చూడాలి.

సునీల్, అనసూయలు హీరోహీరోయిన్లుగా ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శ్రీధర్ సీన్న దర్శకత్వం వహిస్తున్నారు. సుడిగాలి సుధీర్, సప్తగిరి, వెన్నెల కిషోర్, సప్తగిరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కే. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం సుధీర్, దీపిక పిల్లి రోమాన్స్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.