Andrea Sunshine: మనుషుల అభిరుచులు మారుతున్నాయి. మరీ విచిత్రంగా ఉంటున్నాయి. తమ మదిలో అనిపించే భావాలను ఇట్టే వ్యక్తపరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమలు, వివాహాలు, విడిపోవడాలు కామన్ అయిపోయాయి. ఎంత వేగంగా ఇష్టపడి ఒక్కటవుతున్నారో.. కలిసి నడవలేమని అట్టే విడిపోతున్నారు. ముఖ్యంగా సినిమారంగంలో ఈ తరహా పరిణామాలు ఇటీవల అధికమయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఓ అందగత్తె అర్జెంట్ గా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని సంచలన ప్రకటన చేసింది. అది కూడా అద్దెకు కావాలని కోరడం విస్మయపరుస్తోంది. ఇప్పుడీ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. కుర్రకారును ఆకట్టుకుంటోంది. అయితే ఆమె కండీషన్స్ కొందరికి మింగుడుపడడం లేదు. ఆమెకు 30 ఏళ్ల లోపు వయసున్న వారే కావాలట. అంతకు మించి మంచి ఫిట్నెస్ తో ఉండాలట. అంటే కండలు తిరిగే వాడు మాత్రమే కావాలట. అయితే ఇంతగా ఆరాటపడుతున్న ఆ ముద్దుగమ్మ ఎవరో తెలుసా? ఎందుకీ ప్రకటన చేసిందో తెలిస్తే షాకవుతారు. బాయ్ ఫ్రెండ్ రెంట్ కి కోరుతున్న ఆ మహిళ అత్యంత అందమైన మహిళ అని తెలిసి కుర్రకారు తన విన్నపాలను, అర్హతలను ఆమె ముందుంచుతున్నారు.

ఫ్రెంచ్ బ్యూటీ సుఫానే..
ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారు. ప్రపంచానికి అందగత్తెగా సుపరిచితురాలైన అండ్రియా సుఫానే. బ్రెజిల్ కు చెందిన డచ్ మోడల్ భామ. చూడగానే సెక్సీ హవభావాలతో మత్తెక్కించే అందం ఆమె సొంతం. అలాగని ఆమె వయస్సు తక్కువ కాదు. ఐదు పదులు దాటినా ఆమె ఇప్పటికీ మూడు పదుల వయసులోపలే కనిపిస్తుంది. ఆమెకు ఇద్దరు మనుమలు కూడా ఉన్నారు. అంత వయసు ఆమెకు ఉన్నట్టుంది బాయ్ ఫ్రెండ్ అవసరం ఏమొచ్చిందని ఆలోచిస్తున్నారా? అమె అడల్ట్ ఫ్యాన్స్ కోసం ఒక సైట్ క్రియేట్ చేసుకున్నారు. ఇందులో కంటెంట్ మొత్తం బూతులే ఉంటాయి. బూతు వీడియోలు చేయడానికి ఒక యంగ్ బాయ్ ఫ్రెండ్ కావాలంట. అందుకే ఈ భామ ఈ ప్రకటన చేసింది.

ధీటైన కుర్రాడి కోసం..
సుఫానే రోజులో సింహభాగం జిమ్ లోనే గడుపుతుంది. ఐదు పదుల ఈ బ్యూటీ 30 సంవత్సరాల యువతిగా కనిపించడానికి ఫిట్ నెస్సే కారణమని చెబుతోంది. తనకు తానే యంగ్ అండ్ సెక్సీగా ఉంటానంటోంది. తనకు యువత నుంచి ఎన్ని విన్నపాలు వచ్చినా ఒక్కడినే ఎంచుకుంటానంటోంది. అతడితోనే రొమాన్స్ చేస్తానని కూడా చెబుతోంది. ఈ సెక్సీ ఉమెన్ ప్రకటనకు కుర్రకారు భలేగా రియాక్టు అవుతోంది. భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సరైన ఫెర్ ఫెక్ట్ కుర్రాడి కోసం ఆడిషన్స్ సైతం మొదలు పెట్టేసింది ఈ భామ. తన ఫిట్ నెస్ కు ధీటుగా ఉండే కుర్రాడి కోసం అన్వేషిస్తోంది.