Winter Health Tips: శీతాకాలం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయి. మధ్యాహ్నం కూడా చల్లగానే ఉంటుంది. అందుకే పిల్లలు, వృద్ధులు చలికి వణుకుతుంటారు. ఎటైనా బయటకు వెళ్లాలంటే జంకుతుంటారు. ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సందే. చలితో చాలా సమస్యలు వస్తుంటాయి. రక్షణ కోసం స్వెటర్లు, టోపీలు, రుమాళ్లు ధరించాలి. చలి బారి నుంచి కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కూడా అంటుకుంటాయి. దీంతో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. చీటికి మాటికి ఇవి మనకు సమస్యలు తెస్తుంటాయి.

చలికాలంలో గుండె జబ్బుల ప్రభావం కూడా ఎక్కువే. హార్ట్ పేషెంట్లు సాధ్యమైనంత వరకు చలిలో తిరగకపోవడమే బెటర్. ఒకవేళ తిరగాల్సి వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకుని పోవాలి. లేదంటే గుండె జబ్బు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వైద్యుల సలహా మేరకు బయట తిరగాలి. అంతేకాని ఇష్టారాజ్యంగా ప్రవర్తించొద్దు. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కాలు బయట పెట్టాలంటేనే భయం వేస్తోంది. ఎంత అత్యవసర పనులు ఉన్నా ఎండ వచ్చిన తరువాతే చేసుకోవాలని చూస్తున్నారు.
ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలి బారి నుంచి రక్షించుకునేందుకు వారు నానా తంటాలు పడుతున్నారు. చలి మంటలు వేసుకుంటున్నారు. దీంతో చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. సాయంత్రం సమయాల్లో కూడా చలి ఎక్కువగానే ఉంటోంది. అందుకే ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట తిరగకపోవడమే మంచిదని చెబుతున్నారు.

చలికాలంలో వ్యాధులు కూడా తొందరగా సంక్రమిస్తాయి. కరోనా కూడా ఇదే విధంగా వ్యాపించిందే కదా. అందుకే వ్యాధులు రాకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకోవాలి. చలి బారి నుంచి కాపాడుకోవడానికి పలు క్రీములు, దుస్తులు ధరించి రక్షణ పొందాలి. పొడిచర్మం వారికైతే మరింత ఇబ్బందులు తలెత్తుతాయి. వాటి నుంచి రక్షణ పొందడానికి పలు క్రీములను ఆశ్రయించాలి. మాశ్చరైజ్ క్రీములతో కాస్తయినా ఉపశమనం పొందొచ్చు. ఇలా చలి నుంచి కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.