Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది..మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరుకు భారీగా ఉండాలని బలంగా కోరుకున్నారు.

కానీ ఈసారి కూడా ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు..ఎందుకంటే వాల్తేరు వీరయ్య తో పోటీ గా నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ మరియు తమిళ డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ అప్పటికే విడుదల అయ్యిపోయి ఉంటాయి కాబట్టి..థియేటర్స్ భారీగా దొరికే ఛాన్స్ ఉండదు..అందుకే నిర్మాత నవీన్ మరియు డైరెక్టర్ బాబీ ఈ సినిమాని జనవరి 11 వ తేదీన విడుదల చేద్దామని చిరంజీవి ని ఒప్పించే ప్రయత్నం చేసారు..కానీ చిరంజీవి అందుకు ఒప్పుకోలేదు..జనవరి 13 వ తారీఖున విడుదల చేయాల్సిందిగా పట్టుబట్టాడు అట.
మెగాస్టార్ చిరంజీవి నిర్ణయమే ఫైనల్ కాబట్టి నిర్మాతలు కూడా జనవరి 13 వ తేదీన విడుదల చేస్తునట్టు ఈరోజు అధికారిక ప్రకటన చేసారు..వాల్తేరు వీరయ్య కంటే ముందు విడుదల అవుతున్న ‘వారసుడు’ మరియు ‘ వీర సింహా రెడ్డి’ చిత్రాలకు ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే వాల్తేరు వీరయ్య సినిమాకి థియేటర్స్ బాగా దొరుకుతాయి..లేకపోతే 40 శాతం థియేటర్స్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

‘వీర సింహ రెడ్డి’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకు నిర్మాత ఒక్కడే కాబట్టి చిరంజీవి సినిమాకి థియేటర్స్ ని సర్దుబాటు చేసే అవకాశం ఉంది..ఎందుకంటే వాల్తేరు వీరయ్య బిజినెస్ చాలా ఎక్కువ..అది బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే 110 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి..అందుకు ఓపెనింగ్ చాలా బలంగా ఉండాలి..తక్కువ థియేటర్స్ లో విడుదలైతే చిరంజీవి రేంజ్ ఓపెనింగ్ మిస్ అవుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు..మరి అభిమానులను నిరాశ పర్చకుండా మెగాస్టార్ కి కావాల్సినంత థియేటర్స్ ని నిర్మాత సర్దుబాటు చేస్తాడో లేదో చూడాలి.