Walthair Veeraiah Collections : #RRR నే మించిపోయిన ‘వాల్తేరు వీరయ్య’ 10వ రోజు వసూళ్లు.. ఊచకోత కోస్తున్న మెగాస్టార్

Walthair Veeraiah Collections : ఈ సంక్రాంతికి చిరంజీవి – బాలకృష్ణ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో హోరాహోరీ ఉంటుందని అందరూ ఊహించారు.. ఇద్దరికీ సరిసమానమైన ఓపెనింగ్స్ .. క్లోసింగ్స్ వస్తాయని అనుకున్నారు.. కానీ వార్ వన్ సైడ్ అయిపోయింది.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ప్రేక్షకులు నీరాజనం పలికారు.. సంక్రాంతి హాలిడేస్ లో పూర్తి స్థాయి డామినేషన్ చూపించిన ఈ సినిమా సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కూడా బాక్స్ […]

Written By: NARESH, Updated On : January 22, 2023 2:01 pm
Follow us on

Walthair Veeraiah Collections : ఈ సంక్రాంతికి చిరంజీవి – బాలకృష్ణ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో హోరాహోరీ ఉంటుందని అందరూ ఊహించారు.. ఇద్దరికీ సరిసమానమైన ఓపెనింగ్స్ .. క్లోసింగ్స్ వస్తాయని అనుకున్నారు.. కానీ వార్ వన్ సైడ్ అయిపోయింది.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ప్రేక్షకులు నీరాజనం పలికారు.. సంక్రాంతి హాలిడేస్ లో పూర్తి స్థాయి డామినేషన్ చూపించిన ఈ సినిమా సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వీరంగం ఆడేస్తుంది.

వీక్ డేస్ లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యులు కట్టేయడంతో వీకెండ్స్ లో భారీ స్థాయి రష్ ఉంటుందని గ్రహించి థియేటర్స్ బాగా పెంచేసారు..’వీర సింహా రెడ్డి ‘ చిత్రానికి కేటాయించిన థియేటర్స్ అన్నీ ‘వాల్తేరు వీరయ్య’ కి షిఫ్ట్ చేసేసారు నిర్మాతలు.. దీంతో ఆదివారం రోజు ఈ సినిమాకి వచ్చే వసూళ్లు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

కేవలం ఆదివారం రోజే ఈ సినిమాకి 8 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు.. ఒక్క #RRR కి మినహా ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదని,#RRR చిత్రానికి కూడా ఉగాది కలిసి వచ్చింది కాబట్టే 15 కోట్ల రూపాయిల షేర్ ని ఆ ఒక్క రోజు రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు..

మరో విశేషం ఏమిటంటే ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈస్ట్ గోదావరి జిల్లాలో #RRR ఫుల్ రన్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.. #RRR చిత్రానికి ఆ ప్రాంతంలో ఫుల్ రన్ 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇప్పటికే 10 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.. ఫుల్ రన్ లో కచ్చితంగా #RRR ని కొడుతుందని అంటున్నారు.. చూడాలి మరి.