Social Media : సోషల్‌ మీడియాపై సెన్సార్‌ కత్తి.. తప్పుడు వార్తల నియంత్రణ పేరుతో కేంద్రం కట్టడి!

Union government social media : దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా పూర్తిగా పాలకుల నియంణ్రలోకి వెళ్లాయి. పార్టీలే మీడియాను శాసిస్తున్నాయి. జర్నలిజం గురించి తెలియని కొంతమంది నేతలు జర్నలిస్టులకే పాఠాలు చెబుతున్నారు. నిత్యం తమ వార్తలే పతాక శీర్షికలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో డిజిటల్‌ విప్లవం మీడియారంగంలో పెను సంచలనంగా మారింది. వాస్తవాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇదేసమయంలో కొన్నిసార్లు తప్పుడు సమాచారం […]

Written By: NARESH, Updated On : January 22, 2023 1:48 pm
Follow us on

Union government social media : దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా పూర్తిగా పాలకుల నియంణ్రలోకి వెళ్లాయి. పార్టీలే మీడియాను శాసిస్తున్నాయి. జర్నలిజం గురించి తెలియని కొంతమంది నేతలు జర్నలిస్టులకే పాఠాలు చెబుతున్నారు. నిత్యం తమ వార్తలే పతాక శీర్షికలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో డిజిటల్‌ విప్లవం మీడియారంగంలో పెను సంచలనంగా మారింది. వాస్తవాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇదేసమయంలో కొన్నిసార్లు తప్పుడు సమాచారం కూడా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతోంది. మొత్తంగా ప్రస్తుత వ్యవస్థలో డిజిటల్‌ మీడియా అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి డిజిటల్‌ మీడియా కొరకరాని కొయ్యగా మారింది. పాలకుల తప్పులను తూర్పార పట్టడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. సోషల్‌ మీడియా కంపెనీలు ప్రచురించే వాటికి జవాబుదారీగా ఉండేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డిజిటల్‌ మీడియాపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. డిజిటల్‌ మీడియాలో వచ్చిన వార్తా కథనాలు, సమాచారం తప్పుడదని రుజువు చేస్తే సంబంధిత సోషల్‌ మీడియా సంస్థల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడం లేదా జరిమానా విధించేందుకు అవకాశం కల్పించేలా చట్టసవరణ బిల్లును కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ తీర్చిద్దుతోంది.

తప్పుడు వార్త అని నిర్ధారిస్తే తొలగించాల్సిందే..
కేంద్రం తెస్తున్న కొత్త చట్టంతో డిజిటల్‌ న్యూస్‌ ప్రొవైడర్లకు ఆంక్షలు తప్పవు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థ సోషల్‌ మీడియాలో ప్రచురించిన వార్త తప్పని తేలితే దానిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం ప్రింట్, ఎక్ట్రానిక్‌ మీడియాలో రిజండర్‌ అవకాశం ఉంది. సోషల్‌ మీడియాకు ఈ అవకాశం కూడా లేదుకుండా కేంద్రం చేస్తోంది.

-భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం..
కేంద్రం చర్యలతో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవంగా చూస్తే చాలాసార్లు పాలకులే తప్పుడు సమాచారం ఇస్తుంటారు. తప్పుడు వార్తలు రాయిస్తారు. అయితే నియంత్రించే అధికారం కేంద్రం చేతిలోనే ఉండడంతో వాటిని తొలగించే అవకాశం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నిస్తే మాత్రం వాటిని తప్పని తొలగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పలువురు మీడియారంగ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును హరించేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే పత్రికలు, చానెళ్లను ప్రభుత్వాలు పూర్తిగా కంట్రోల్‌ చేస్తున్నాయి. ఇప్పుడు డిజిటల్‌ మీడియాపై కూడా నియంత్రణకు పాల్పడితే నిజాలు చెప్పే పరిస్థితి కరువవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చెందుతున్నారు.