Walthair Veeraiah 10 Days Collections : అక్షరాల 200 కోట్ల రూపాయిల గ్రాస్.. బాక్స్ ఆఫీస్ వద్ద వీరంగం ఆడేస్తున్న ‘వీరయ్య’

Walthair Veeraiah 10 Days Collections : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వీరంగం ఆడేస్తున్న సంగతి తెలిసిందే.. జనవరి 13వ తారీఖున ప్రారంభమైన ఈ బాక్స్ ఆఫీస్ తూఫాన్ ఉధృతి ఇప్పటికీ తగ్గలేదు.. వర్కింగ్ డేస్ లో అద్భుతమైన వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వీకెండ్ లో చెలరేగిపోయింది.. ఆదివారం రోజు మార్నింగ్ షోస్ నుండే ప్రారంభమైన బాక్స్ ఆఫీస్ రాంపేజ్ నైట్ షోస్ వరకు సాగింది. రెండోరోజు […]

Written By: NARESH, Updated On : January 22, 2023 8:39 pm
Follow us on

Walthair Veeraiah 10 Days Collections : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వీరంగం ఆడేస్తున్న సంగతి తెలిసిందే.. జనవరి 13వ తారీఖున ప్రారంభమైన ఈ బాక్స్ ఆఫీస్ తూఫాన్ ఉధృతి ఇప్పటికీ తగ్గలేదు.. వర్కింగ్ డేస్ లో అద్భుతమైన వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వీకెండ్ లో చెలరేగిపోయింది.. ఆదివారం రోజు మార్నింగ్ షోస్ నుండే ప్రారంభమైన బాక్స్ ఆఫీస్ రాంపేజ్ నైట్ షోస్ వరకు సాగింది. రెండోరోజు ఈ సినిమాకి ఎలాంటి వసూళ్లు అయితే వచ్చాయో, అలాంటి వసూళ్లనే ఆదివారం రోజు కూడా రాబట్టింది.

9 రోజులకు గాను 182 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 10 రోజులకు కలిపి 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని అద్భుతం అనే చెప్పాలి..మెగాస్టార్ కమర్షియల్ సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ వసూళ్లు వస్తాయా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు.

నైజాం ప్రాంతంలో ఈ సినిమా నిన్నటితో 30 కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటింది.. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ మరియు అల్లు అర్జున్ మాత్రమే ఈ రేంజ్ వసూళ్లను రాబట్టారు.. వాళ్ళతో పాటుగా రెండు సార్లు 30 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన హీరోగా చిరంజీవి రికార్డ్స్ లోకి ఎక్కాడు.. సీడెడ్ ప్రాంతంలో అయితే నిన్నటితో ఈ సినిమా 16 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని దాటింది.

మరో నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేస్తే నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ చిరంజీవి ఖాతాలో ఉంటుంది .. అలా ఈ సినిమా కేవలం 10 రోజుల రన్ తోనే నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ కి ఇంచు దూరంలో ఉంది,.వచ్చే వారంలో ఆ దూరాన్ని కూడా కవర్ చేసేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం నిన్నటి వరకు 2.3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.. ఫుల్ రన్ లో ఎంత వరకు లాగుతుందో చూడాలి.