Tollywood TOP Heros : టాలీవుడ్ దేశంలోనే నంబర్ వన్ పరిశ్రమగా ఎదగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి స్టార్స్ సంఖ్య. దాదాపు పది మంది స్టార్ హీరోలు పరిశ్రమలో ఉన్నారు. వంద కోట్ల షేర్ అవలీలగా కొట్టేసే హీరోలు అరడజనుకు పైగా ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇతర పరిశ్రమల్లో కూడా మార్కెట్ సాధించారు. పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించారు. అదే సమయంలో ఫ్యాన్ వార్స్ కూడా ఎక్కువే. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ కొట్టుకుంటూ ఉంటారు. మెగా వర్సెస్ నందమూరి, అల్లు అర్జున్ వర్సెస్ మహేష్, ప్రభాస్ ఇలా ఫ్యాన్ వార్స్ చోటు చేసుకుంటాయి. తిక్కరేగితే మెగా హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలు చోటు చేసుకుంటాయి.

పవన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్ మెగా హీరో ఇమేజ్ నుండి బయటకు రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన ఉంది. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ నడపడమే దీనికి కారణం. సాధారణంగా ప్రతి హీరో ఫ్యాన్స్ మా హీరోనే గొప్పంటారు. కాబట్టి రెగ్యులర్ గా సినిమాలు చూసే కామన్ ఆడియన్స్ ని ఈ విషయం అడిగితే బెటర్.
దీనిపై ప్రతి నెలా సర్వేలు చేసే ఓ బాలీవుడ్ సంస్థ ఉంది. ఆర్మాక్స్ అనే ఈ మీడియా సంస్థ దేశంలోని ప్రధాన చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్స్ స్టార్డమ్, పాపులారిటీ మీద సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. 2022 ముగిసిన నేపథ్యంలో 12 నెలల రిజల్ట్ క్రోడీకరించి పరిశ్రమల వారీగా స్టార్ హీరోల ర్యాంక్స్ వారి పాపులారిటీ ఆధారంగా ప్రకటించారు.
ఆర్మాక్స్ సంస్థ సర్వే ప్రకారం 2022లో టాలీవుడ్ స్టార్స్ ర్యాంక్స్ పరిశీలిస్తే… ప్రభాస్ ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అంటే ఆయన టాలీవుడ్ టాప్ హీరోగా జనాలు నిర్ణయించారు. బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ కి ప్లాప్స్ పడినా మేనియా తగ్గలేదని చెప్పేందుకు ఇది నిదర్శనం. ఒక సెకండ్ ప్లేస్ ఎన్టీఆర్ కి దక్కింది. ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యే వరకు సెకండ్ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉండేవారు. ప్రస్తుతం ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యారు. నాలుగో ర్యాంక్ రామ్ చరణ్ కి , ఐదవ ర్యాంక్ మహేష్ కి దక్కాయి. ఇక వరుసగా పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ టాప్ టెన్ లో చోటు సంపాదించారు.
Top 10 most popular male Telugu film stars of 2022#Ormax2022 #OrmaxStarsIndiaLoves #OrmaxSIL pic.twitter.com/hr7rdFcxmj
— Ormax Media (@OrmaxMedia) January 21, 2023