https://oktelugu.com/

Waltair Veerayya – Poonakaalu Loading Lyric : చిరంజీవి, రవితేజ డ్యాన్సులకు నిజంగానే ‘పూనకాలు లోడింగ్’.. వైరల్ వీడియో

Waltair Veerayya – Poonakaalu Loading Lyric : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతోంది.. ఈ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మాస్ మహారాజ రవితేజ , రాజేంద్ర ప్రసాద్, ఊర్వశి రౌతుల, దేవి శ్రీ ప్రసాద్ , శ్రీనివాస్ రెడ్డి , శేఖర్ మాస్టర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ తదితరులు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2022 / 06:53 PM IST
    Follow us on

    Waltair Veerayya – Poonakaalu Loading Lyric : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతోంది.. ఈ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మాస్ మహారాజ రవితేజ , రాజేంద్ర ప్రసాద్, ఊర్వశి రౌతుల, దేవి శ్రీ ప్రసాద్ , శ్రీనివాస్ రెడ్డి , శేఖర్ మాస్టర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ తదితరులు హాజరై సినిమా విశేషాలు బయటపెట్టి మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశారు.

     

    అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన కంటెంట్ ఆకట్టుకుంది.. మెగాస్టార్ చిరంజీవి టీజర్ , బాస్ పార్టీ సాంగ్ తో మార్కెట్ లో విపరీతమైన బజ్ ని ఏర్పర్చుకున్న ఈ సినిమా..ఈరోజు విడుదలైన రవితేజ టీజర్ తో ఆ బజ్ ని వేరే స్థాయికి తీసుకెళ్లింది.. రవితేజ కి ‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత అంతటి పవర్ ఫుల్ పాత్ర ఈ సినిమా ద్వారా పడినట్టు అనిపిస్తుంది.

    ఈ ఊపును మరింత పెంచుతూ తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘పూనకాలు లోడింగ్’ అంటూ సాంగ్ విడుదల చేశారు. ఇందులో చిరంజీవి , రవితేజ పూనకాలతో వందలమంది డ్యాన్సర్లతో ఊగిపోయేలా చేసిన డ్యాన్స్ ఓ రేంజ్ లో ఉంది.

    మొదట చిరంజీవి ఈ డ్యాన్స్ లో ఇరగదీయగా.. మధ్యలో రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ పోటీపోటీగా వేసిన స్టెప్పులు ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమాలోనూ వీరిద్దరూ పోటీపోటీ క్యారెక్టర్లు చేసినట్టు అర్థమవుతోంది. ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ అంటూ చిరంజీవి, రవితేజ ఈ పాటతో ఉర్రూతలూగించారనే చెప్పాలి.