Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎంత ప్రత్యేకమో ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి కూడా అంతే ప్రత్యేకం..ఆద్యంతం వినోదభరితం తో సాగిపోతూనే..గుండెల్ని పిండేసే రేంజ్ ఎమోషన్స్ తో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యింది..ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక సినిమా కనెక్ట్ అయితే అది ప్రభంజనమే..వసూళ్లు రావడమే కానీ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది ఎవ్వరం చెప్పలేం..సంక్రాంతి సెలవలు కాబట్టి కలెక్షన్స్ బాగా వస్తాయి..సెలవలు ముగిసిన తర్వాత కూడా వర్కింగ్ డేస్ సైతం మంచి వసూళ్లను రాబట్టడం అనేది ప్రస్తుతం ఉన్న ఓటీటీ కాలం లో చాలా కష్టం..అలాంటిది మెగాస్టార్ చిరంజీవి చాలా అలవోకగా రికార్డ్స్ పెట్టేసాడు..16 రోజులకు కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 34.50 కోట్లు
సీడెడ్ 17.56 కోట్లు
ఉత్తరాంధ్ర 18.80 కోట్లు
ఈస్ట్ 12.40 కోట్లు
వెస్ట్ 7.36 కోట్లు
నెల్లూరు 4.35 కోట్లు
గుంటూరు 7.25 కోట్లు
కృష్ణ 7.40 కోట్లు
మొత్తం 109.62 కోట్లు
ఓవర్సీస్ 12.64 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.70 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 129.96 కోట్లు

ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డుని నెలకొల్పారు..అదేమిటంటే ప్రభాస్ మరియు అల్లు అర్జున్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కి రెండు 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించిన సినిమాలు ఉన్నాయి..అందులో ఒకటి సై రా నరసింహ రెడ్డి కి 140 కోట్ల రూపాయిలు వసూళ్లు రాగా , ఇప్పుడు వాల్తేరు వీరయ్య చిత్రం 130 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది..అంతే కాకుండా ఈ రెండు సినిమాలు మన తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించాయి..ఇది కూడా ఒక రేర్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఫుల్ రన్ లో 140 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.