https://oktelugu.com/

Balagam Movie : ఒక కమెడియన్ వి ఇలాంటి సినిమా ఎలా తీశావ్? వేణు ముఖాన అడిగిన వివి వినాయక్

Balagam Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో వేణు ఎల్దండి అంటే ఒక సెన్సేషన్. ఆయన ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. కమెడియన్ గా, జబర్దస్త్ టీమ్ లీడర్ గా రాని గుర్తింపు బలగం మూవీ తెచ్చిపెట్టింది. చెప్పాలంటే వేణు మీద గౌరవం పెరిగింది. దానికి కారణం… ఒక చిన్న పాయింట్ పట్టుకొని రెండు గంటలు సినిమాను ఎమోషనల్ గా నడిపించిన విధానానికి ప్రేక్షకులు పడిపోయారు. బలగం మూవీ చూశాక ప్రతి ఒకరి అభిప్రాయం […]

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2023 / 08:32 PM IST
    Follow us on

    Balagam Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో వేణు ఎల్దండి అంటే ఒక సెన్సేషన్. ఆయన ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. కమెడియన్ గా, జబర్దస్త్ టీమ్ లీడర్ గా రాని గుర్తింపు బలగం మూవీ తెచ్చిపెట్టింది. చెప్పాలంటే వేణు మీద గౌరవం పెరిగింది. దానికి కారణం… ఒక చిన్న పాయింట్ పట్టుకొని రెండు గంటలు సినిమాను ఎమోషనల్ గా నడిపించిన విధానానికి ప్రేక్షకులు పడిపోయారు. బలగం మూవీ చూశాక ప్రతి ఒకరి అభిప్రాయం ఏమిటంటే… కమెడియన్ వేణులో ఇంత విషయం ఉందా? అని. వేణు పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆయన జర్నీకి దర్శకుడిగా తెరకెక్కించిన సినిమాకు సంబంధం లేదు.

    పల్లెటూళ్లలో విచ్ఛిన్నమైన ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన లోతైన భావాలు ఆయన వెండితెర మీద ఆవిష్కరించారు. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వేణును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన వివి వినాయక్ వేణుతో ముచ్చటించారు. ఈ క్రమంలో వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వేణును అడిగిన మొదటి ప్రశ్న.. హాస్య నటుడివి అయ్యుండి, ఇంత ఎమోషనల్ మూవీ ఎలా తీశావు, అని. దానికి వేణు, నిజంగా నా నుండి మూవీ అంటే అందరూ కామెడీ మూవీ అనుకుంటారు. దానికి భిన్నంగా నేను సినిమా తీశానని వేణు అన్నారు.

    వినాయక్ మాట్లాడుతూ… కొన్ని తమిళ చిత్రాలు చూస్తే టాలీవుడ్ ఈ తరహా చిత్రాలు కోల్పోతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ టైప్ మంచి సినిమాలు మిస్ అవుతున్నామని అనిపిస్తుంది. ఆ లోటు నీ సినిమా తీర్చింది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఎమోషన్ అంత సేపు నడపడం గొప్ప విషయం. నీ సినిమా కనెక్ట్ కావడానికి మరొక కారణం… ఇది అందరి జీవితాల్లో ఎదురయ్యే విషయం. ఆ కాకి వస్తుందా? లేదా? అనే టెన్షన్ ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. అది నీ సినిమాలో చెప్పావు.

    మా ఫాదర్ చనిపోయినప్పుడు పెదకర్మ చేస్తుంటే అక్కడ ఉన్నవాళ్లు ఇక్కడకు కాకులు రావు. ఆవులు తినేస్తాయని చెప్పారు. సరే ప్రయత్నం చేద్దాం అని, కాసేపు వేచి చూశాము. శూన్యంలో నుండి కొన్ని గద్దలు వచ్చి మొత్తంగా ఎత్తుకెళ్లిపోయాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఇగోలు పోతే ఎంత చక్కగా కలిసిపోతారు. అనుభందం ఎంతగా పెనవేసుకుంటుందని చక్కగా చెప్పావని ప్రశంసించారు. వేణును వివి వినాయక్ వంటి దర్శకుడు పొగడడం గొప్ప విషయం.