Vizianagaram : అమ్మ.. రెండక్షరాల పదాన్ని మించిన గొప్ప కావ్యం ప్రపంచంలోనే లేదు. అమ్మ ఓ దైవం.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. బ్రహ్మ అయినా.. ఓ అమ్మకు కొడుకే.. ఎంత చెప్పినా అమ్మగురించి తక్కువే. బిడ్డలు చెడ్డ వారు కావొచ్చు కానీ.. తల్లి ఎప్పుడు చెడ్డది కాదు. జ్ఞానం లేని జీవులు కూడా పిల్లలపై మాతృత్వాన్ని చూపుతాయి. కానీ, ఇక్కడ ఓ తల్లి దారితప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్ ఇంజినీర్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసుకుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగాలు విపరీతంగా పెరిగేలా.. యుక్త వయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. కన్న తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్ చేసి చైల్డ్‌లైన్‌ను ఆశ్రయించింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Vizianagaram a mother trying to lure her daughter into prostitution
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com