Das Ka Dhamki Collection : ‘దాస్ కా ధమ్కీ’ 2 రోజుల వసూళ్లు.. విశ్వక్ సేన్ జాక్ పాట్ కొట్టేసాడు

Vishwak Sen’s ‘Das Ka Dhamki’ Collection.. : విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం నిన్న ఉగాది కానుకగా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాకి దర్శకుడు మరియు నిర్మాత కూడా విశ్వక్ సేన్.మొదటి రోజు కాస్త నెగటివ్ టాక్ తో సినిమా ప్రారంభం అయ్యినప్పటికీ ఈవెనింగ్ షోస్ లోపు టాక్ కాస్త పాజిటివ్ గా మారి స్థిరపడింది.దాంతో మొదటి రోజు వసూళ్లు […]

Written By: NARESH, Updated On : March 23, 2023 9:37 pm
Follow us on

Vishwak Sen’s ‘Das Ka Dhamki’ Collection.. : విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం నిన్న ఉగాది కానుకగా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాకి దర్శకుడు మరియు నిర్మాత కూడా విశ్వక్ సేన్.మొదటి రోజు కాస్త నెగటివ్ టాక్ తో సినిమా ప్రారంభం అయ్యినప్పటికీ ఈవెనింగ్ షోస్ లోపు టాక్ కాస్త పాజిటివ్ గా మారి స్థిరపడింది.దాంతో మొదటి రోజు వసూళ్లు అదిరిపోయాయి.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు షేర్ వచ్చిందట.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అయ్యాయి.అయితే పండగ తర్వాతి రోజు కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతాయేమో అని అందరూ అనుకున్నారు.కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం రెండవ రోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టినట్టు సమాచారం.

అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండవ రోజు ఉత్తరాంధ్ర మరియు కృష్ణ జిల్లాలలో డీసెంట్ స్థాయి హోల్డ్ ని కనబర్చిందట.కానీ నైజాం ప్రాంతం లో మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయినట్టు సమాచారం.రెండవ రోజు ఈ ప్రాంతం నుండి కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టిందట.ఈ ప్రాంతం ఒక్కటే ట్రేడ్ కి నిరాశ కలిగించింది.

అలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండవ రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ ని సాధించిందని, రెండు రోజులకు కలిపి 7 కోట్ల రూపాయిలను రాబట్టిందని అంటున్నారు.ఈ సినిమాని 7 కోట్ల 50 లక్షల రూపాయలకు బయ్యర్స్ కొనుగోలు చేసారు.రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చేసింది, ఇక రేపటి నుండి ఎంత వచ్చినా లాభాలే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఫుల్ రన్ లో ఎంతదాకా బాక్స్ ఆఫీస్ వద్ద లాగుతుందో చూడాలి.