https://oktelugu.com/

Rana Naidu : బూతు సిరీస్ అన్నారు.. కానీ ‘రానా నాయుడు’ లేటెస్ట్ రికార్డు చూస్తే మతిపోవాల్సిందే!

Rana Naidu : వెంకటేష్ – రానా కాంబినేషన్ లో రెండు వారల క్రితం విడుదలైన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కి సోషల్ మీడియా లో ఎలాంటి నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.సినిమా మొత్తం కుర్రాళ్లు కూడా వినడానికి సిగ్గు పడే బూతులు ఉన్నాయని, ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ ఇప్పటి వరకు తెలుగు లో రాలేదని ఇలా ఎన్నో నెగటివ్ కామెంట్స్ ని ఎదురుకుంది ఈ వెబ్ సిరీస్. మూడు దశాబ్దాల నుండి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 23, 2023 / 09:40 PM IST
    Follow us on

    Rana Naidu : వెంకటేష్ – రానా కాంబినేషన్ లో రెండు వారల క్రితం విడుదలైన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కి సోషల్ మీడియా లో ఎలాంటి నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.సినిమా మొత్తం కుర్రాళ్లు కూడా వినడానికి సిగ్గు పడే బూతులు ఉన్నాయని, ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ ఇప్పటి వరకు తెలుగు లో రాలేదని ఇలా ఎన్నో నెగటివ్ కామెంట్స్ ని ఎదురుకుంది ఈ వెబ్ సిరీస్.

    మూడు దశాబ్దాల నుండి విక్టరీ వెంకటేష్ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం ఈ ఒక్క సిరీస్ తో కొట్టుకుపోయాయని, ఇంకోసారి ఇలాంటి సిరీస్ చేస్తే మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తాము అంటూ వెంకటేష్ అభిమానులు సోషల్ మీడియా లో వెంకటేష్ ని ట్యాగ్ చేసి ట్వీట్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, అయితే ఇంత నెగటివిటీ మధ్య కూడా ఈ సిరీస్ ఘన విజయం సాధించింది.

    గత వారం రోజుల నుండి ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లకు సంబంధించిన కొత్త ఎపిసోడ్స్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ కూడా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ క్రిందనే ట్రెండ్ అవుతున్నాయి. రానా నాయుడు మాత్రం గత రెండు వారాల నుండి టాప్ 1 లోనే ట్రెండ్ అవుతూ ఉంది.ఇప్పటి వరకు ఈ సిరీస్ కి 150 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చినట్టు సమాచారం.

    హాలీవుడ్ వెబ్ సిరీస్ లతో సమానంగానే వ్యూస్ వచ్చాయి. నెగెటివ్ పబ్లిసిటీ తో కూడా ఒక సిరీస్ ఘన విజయం సాధించడం ఇదే తొలిసారి.అయితే సిరీస్ అడల్ట్ కంటెంట్ అయ్యుండొచ్చు కానీ, ఒక వర్గం ఆడియన్స్ ని మాత్రం బాగానే అలరించింది.వెంకటేష్ లాంటి పెద్ద యాక్టర్ నోటి నుండి ఇలా బూతులు రావడం వల్లే నెగటివ్ టాక్ వచ్చింది కానీ, కుర్ర హీరోలు చేసి ఉంటే పాజిటివ్ టాక్ వచ్చేది అని విశ్లేషకుల అభిప్రాయం.