https://oktelugu.com/

Anchor Rashmi : యాంకర్ రష్మీ గౌతమ్ ని దారుణంగా అవమానించిన విశ్వక్ సేన్… వీడియో వైరల్!

  Anchor Rashmi – Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఫలక్ నుమా దాస్ మూవీ టైంలో హీరో విజయ్ దేవరకొండకు పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. నా సినిమా పోస్టర్స్ చించేశారని ఫైర్ అయ్యాడు. ఇక నటుడు అర్జున్ దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేశాడు. అదో పెద్ద పంచాయితీ అయ్యింది. ఇన్నేళ్ల కెరీర్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 23, 2023 / 08:39 AM IST
    Follow us on

     

    Anchor Rashmi – Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఫలక్ నుమా దాస్ మూవీ టైంలో హీరో విజయ్ దేవరకొండకు పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. నా సినిమా పోస్టర్స్ చించేశారని ఫైర్ అయ్యాడు. ఇక నటుడు అర్జున్ దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేశాడు. అదో పెద్ద పంచాయితీ అయ్యింది. ఇన్నేళ్ల కెరీర్లో విశ్వక్ సేన్ వంటి నిబద్ధత, క్రమశిక్షణ లేని నటుడిని చూడలేదంటూ… అర్జున్ ఆరోపణలు చేశారు.

    హీరో విశ్వక్ సేన్ మీద అర్జున్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేశారు. దాంతో విశ్వక్ కొంత డబ్బు అర్జున్ కి తిరిగి కట్టాల్సి వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం మీద విశ్వక్ సేన్ ని వివరణ అడగ్గా… ఆయన స్పందించేందుకు ఇష్టపడలేదు. దాస్ కా ధమ్కీ చిత్ర ప్రమోషన్స్ లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. దాస్ కా ధమ్కీ చిత్రంతో ఇది సంబంధం లేని మేటర్. కాబట్టి దాన్ని వదిలేద్దాం అన్నారు.

    ఇక దాస్ కా ధమ్కీ చిత్రానికి ఆయనే దర్శకుడు, నిర్మాత, హీరో కావడం విశేషం. తన స్క్రిప్ట్ తెరకెక్కించే సత్తా మరో దర్శకుడుకి లేదని తానే బాధ్యత తీసుకున్నాడు. ఉగాది కానుకగా మార్చి 22న విడుదలైన దాస్ కా ధమ్కీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్లు మాత్రం బాగున్నాయని టాక్. దాస్ కా ధమ్కీ ఓపెనింగ్స్ బాగున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డారు. దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడం ప్లస్ అయ్యింది. అది ఓపెనింగ్స్ కి బాగా ఉపయోగపడింది.

    ఇదిలా ఉంటే యాంకర్ రష్మీ గౌతమ్ ని విశ్వక్ సేన్ దారుణంగా అవమానించాడు. లాంగ్ డ్రైవ్ కి తీసుకెళతానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. రష్మీ లాంగ్ డ్రైవ్ కి వెళదామా? అని అడగ్గా.. యస్ అని ఆమె ఎగిరి గంతేసింది. అయితే నువ్వే వెళ్ళు అంటూ ఆమెకు షాక్ ఇచ్చాడు. అయితే ఇదంతా నిజం కాదులెండి. జబర్దస్త్ స్కిట్ లో భాగంగా జరిగింది. దాస్ కా ధమ్కీ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ జబర్దస్త్ షోకి వచ్చారు. రామ్ ప్రసాద్ తో పాటు స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో రష్మీ-విశ్వక్ మధ్య ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.