https://oktelugu.com/

‘Das Ka Dhamki’ Collections : ‘దాస్ కా ధమ్కీ’ క్లోసింగ్ కలెక్షన్స్..ఇక్కడ హిట్..అక్కడ ఫట్

‘Das Ka Dhamki’ Collections : విభిన్నమైన పాత్రలు పోషిస్తూ యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పర్చుకున్న హీరో విశ్వక్ సేన్.’ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం లో ఇతగాడి నటన చూసినప్పుడే అందరికీ అర్థం అయిపోయింది భవిష్యత్తులో ఇతను మంచి స్థాయికి చేరుకుంటాడని.కానీ అలాంటి సినిమాలే ఈయనకి పడడం లేదు, రీసెంట్ గానే ఆయన దర్శకుడిగా , హీరో గా మరియు నిర్మాతగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ భారీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 10, 2023 / 10:57 PM IST
    Follow us on

    ‘Das Ka Dhamki’ Collections : విభిన్నమైన పాత్రలు పోషిస్తూ యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పర్చుకున్న హీరో విశ్వక్ సేన్.’ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం లో ఇతగాడి నటన చూసినప్పుడే అందరికీ అర్థం అయిపోయింది భవిష్యత్తులో ఇతను మంచి స్థాయికి చేరుకుంటాడని.కానీ అలాంటి సినిమాలే ఈయనకి పడడం లేదు, రీసెంట్ గానే ఆయన దర్శకుడిగా , హీరో గా మరియు నిర్మాతగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ భారీ అంచనాల నడుమ విడుదలై మంచి టాక్ ని తెచ్చుకుంది.

    ఓపెనింగ్స్ అయితే అదిరిపోయాయి కానీ,రెండవ రోజు నుండి కలెక్షన్స్ మాత్రం బాగా తగ్గిపోయాయి.ఇక ఆ తర్వాత ‘దసరా’ సినిమా విడుదల అవ్వడం తో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు.ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరో లెవెల్ కి వెళ్లాడని అందరూ అనుకున్నారు కానీ 20 కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి చేరుకోలేకపొయ్యాడు.

    ఇప్పటికైతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ అయిపోయింది.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 6 కోట్ల రూపాయిలు మాత్రమే.ఫుల్ రన్ లో పెట్టిన డబ్బులకు రెండింతలు ఎక్కువ వచ్చాయి, కానీ ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్స్ తో పోలిస్తే చాలా తక్కువ అని ట్రేడ్ పండితుల అభిప్రాయం.మొదటి రోజు ఆ సినిమాకి సుమారుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    రెండవ రోజు నుండి అందులో రోజువారీ వసూళ్లు 50 శాతం కంటే తక్కువే.ఈ చిత్రం తో 20 కోట్లు లేదా 30 కోట్ల రూపాయిల మార్కెట్ లోకి అడుగుపెడుదామని చూసిన విశ్వక్ సేన్ ఆశలు చివరికి ఆశలు గానే మిగిలిపోయాయి.తెలుగు వెర్షన్ సూపర్ హిట్ గా నిల్చింది, కానీ ఇతర బాషలల్ ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు కోటి రూపాయిలకంటే తక్కువ అని చెప్తున్నారు.