
Virupaksha Collection: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో ఒక సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బయ్యర్స్ కి విరూపాక్ష రూపం లో జాక్పాట్ తగిలింది అనే చెప్పాలి. మొదటి మూడు రోజుల్లోనే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, నాల్గవ రోజు కూడా సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంది.
ఉదయం ఆట నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలతో ప్రారంభమైన ఈ సినిమా, మాట్నీస్ మరియు ఫస్ట్ షోస్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ చోట హౌస్ ఫుల్స్ ని నమోదు చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో అయితే ఎన్ని థియేటర్స్ ఉంటె అన్నీ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
కొన్ని ప్రాంతాలలో అయితే అదనపు షోస్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇలా వీకెండ్ కానీ,లేదా మొదటి రోజు సినిమాలకు కానీ జరుగుతాయి.కానీ నాల్గవ రోజు అనగా వర్కింగ్ డే రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ ని చూసి చాలా కాలం అయ్యింది. మెగా ఫ్యామిలీ హీరోలకు హిట్ పడితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని ట్రేడ్ పండితులు ఇందుకే అంటారు.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ సినిమా నాల్గవ రోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఈరోజు తో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాదిస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాయి ధరమ్ తేజ్ కం బ్యాక్ సినిమా ఈ రేంజ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.