https://oktelugu.com/

Virupaksha collections : రంజాన్ రోజు ‘విరూపాక్ష’ ప్రభంజనం..రాయలసీమ లో మొదటి రోజు కంటే రెండింతలు ఎక్కువ వసూళ్లు

Virupaksha collections : సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇక రెండవ రోజు రంజాన్ అవ్వడం తో మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2023 / 09:51 PM IST
    Follow us on

    Virupaksha collections : సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇక రెండవ రోజు రంజాన్ అవ్వడం తో మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి.

    ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో హిట్ కొడితే ఈ రేంజ్ లో కొట్టాలి అనిపించేలా చేసింది ఈ చిత్రం.ప్రతీ సెంటర్ లోను ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం లో రంజాన్ రోజు అద్భుతమైన వసూళ్లు వస్తాయి.విరూపాక్ష చిత్రానికి కూడా అలాంటి వసూళ్లే వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

    వాళ్ళ లెక్క ప్రకారం రాయలసీమ ప్రాంతం లో ‘విరూపాక్ష’ చిత్రానికి రెండవ రోజు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట.మొదటి రోజు ఈ చిత్రానికి ఇక్కడ కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.అలాంటిది రెండవ రోజు మొదటి రోజు కంటే డబుల్ కలెక్షన్స్ రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

    రాయలసీమ ప్రాంతం లో మాస్ సినిమాలతో పాటుగా, హారర్ సినిమాలు కూడా అద్భుతంగా ఆడుతాయి.హర్రర్ + రంజాన్ + బ్లాక్ బస్టర్ టాక్ ఇలా అన్నీ వరుసగా కలిసి రావడం తో, ఈ చిత్రానికి రెండవ రోజు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.కేవలం రెండవ రోజు మాత్రమే కాదు, ఫుల్ రన్ లో కూడా ఈ సినిమా 10 కోట్ల రూపాయిల షేర్ మార్కుని సీమలో టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు, చూడాలి మరి.