
leopard Surya Namaskar : సూర్య నమస్కారం అనేది భారతీయ సంస్కృతిలో భాగం. గతంలో బ్రాహ్మణులు మాత్రమే నదీ తీరానికి వెళ్లి సూర్య నమస్కారం చేసేవారు. ప్రస్తుతం ఆరోగ్యంపై ఆసక్తి పెరిగింది. దీంతో యోగా చేసేవారు పెరిగారు. ఈ క్రమంలో యోగాలో భాగమైన సూర్య నమస్కారానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. కనిపించే దైవంగా సూర్యున్ని భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే మనుషులే సూర్య నమస్కారం చేస్తారని ఇంత వరకు తెలుసు. కానీ రష్యా ఫారెస్ట్‌లోని ‘ల్యాండ్ ఆఫ్ ది లెపార్డ్’ నేషనల్ పార్క్‌లో ఓ చిరుతపులి సూర్యనమస్కారం చేస్తూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఐఎఫ్‌ఎస్ అధికారి పోస్టు..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ… తరచూ అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా సోషల్ మీడియాలో చిరుతపులికి సంబంధించిన ఒక మనోహరమైన వీడియోను తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ఈ వీడియోలో చిరుతపులి నిద్రలేచాక వార్మప్ చేయడం కనిపిస్తుంది. ఉదయాన్నే శరీరాన్ని సాగదీయడం.. కాళ్లమీద ముందుకు ఒంగి తల పైకెత్తి ఆ తరువాత వెనక కాళ్లను ముందు సాగదీసి బాడీని యాక్టివ్ చేసుకుంటుంది.
సూర్య నమస్కారంతో పోలిక..
సాధారణంగా చిరుత ఒక్కటే కాదు చాలా జంతువులు ఉదయం లేవగానే ఇలాగే చేస్తాయి. కానీ ఐఎస్‌ఎస్ అధికారి నందా పోస్టు చేసిన చిరుత వీడియోకు ‘సూర్య నమస్కారం చేస్తున్న చిరుతపులి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ..
– ‘ఈ యోగా మూవ్‌లను వారికి ఎవరు నేర్పిస్తారు యోగా టీచర్ లేడు, యూట్యూబ్ లేదు, పుస్తకాలు లేవు’ అని సరదాగా రాశారు.
– ‘ఫిట్‌నెస్ ఫ్రీక్ చిరుతపులి’ అని మరొకరు అన్నారు.
– మరికొందరు చిరుతపులి ‘ఫిట్‌నెస్ రహస్యం ఏంటి’ అని అడుగుతున్నారు.
– ‘వావ్ వాస్తవానికి ఇదీ అసలు సూర్య నమస్కారం’ అని ఇంకొందరు పోస్టు చేశారు.
– ‘నా కుక్కలు కూడా అలాగే చేస్తాయి’ అంటూ కొందరు కామెంట రాశారు.
రహస్య కెమెరాతో బంధించి..
అడవి జంతువుల కదలికలను గమనించడానికి అమర్చిన రహస్య కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఈ వీడియోని మొదట్లో ఐఎఫ్‌ఎస్ అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 124,000 కంటే ఎక్కువ వ్యూస్ రాగా.. 2,500 లైక్‌లు వచ్చాయి. ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి మైక్రో– బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో ఆసక్తికరమైన వన్యప్రాణుల గురించి పంచుకోవడంలో చాలా పేరు పొందారు. గత వారం గుజరాత్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న సింహాన్ని కుక్కలు తరిమికొట్టిన వీడియో షేర్ చేశాడు.
Surya Namaskar by the leopard 👌👌
Via @Saket_Badola pic.twitter.com/jklZqEeo89— Susanta Nanda IFS (Retd) (@susantananda3) March 27, 2023