Viral Video : సాధారణంగా మన దారిన మనం వెళ్తుంటే అనుకోకుండా ఏదయినా అవాంతరం ఎదురయితే ఎలా ఉంటుంది? బీపీ పెరిగి, కోపం నషాళానికి అంటుతుంది. ఆ అవాంతరానికి కారణమైన వాడికి ఒక్కటియ్యాలనిపిస్తుంది. ఇక కారు లో వెళ్ళే వారికయితే ఇలాంటి అనుభవం ఎదురైతే కోపం ఫీక్స్ లో వస్తుంది. ఇలాంటి సంఘటనే ఓ వ్యక్తికి ఎదురయింది. చూడ్డానికి అతడు బాహుబలి లా ఉన్నా..ఆ అవాంతరానికి కారణమైన వ్యక్తిని ఏమీ అనలేదు. ఎందుకంటే ఆ సమయానికి ఆ వ్యక్తి అక్కడ లేడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? అతడు చేసిన పని ఏంటి? మీరూ చదివేయండి. కానీ దాన్ని అస్సలు ప్రయత్నించకండి.
ఒళ్లు మండింది
హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని వెంట పెట్టుకొని తన ” బ్లాక్ టాటా హరియర్” కారులో వ్యక్తిగత పని మీద బయటకు వెళ్తున్నాడు. అసలే అది ఇరుకు రోడ్డు..పైగా పక్కన వరిసగా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. దీంతో తన వాహన వేగాన్ని ఆ వ్యక్తి తగ్గించాడు. పానకం లో పుడక లాగా ఆ ఇరుకు రోడ్డులో ఓ కారు యజమాని తన వాహనాన్ని పార్క్ చేశాడు. అది కూడా రోడ్డుకు కాస్త అడ్డంగా. దీంతో ఆ టాటా హరీయర్ యజమానికి ఒళ్ళు మండింది. చూడ్డానికి బాహుబలి లా ఉన్నా…నవ్వుతూనే కారును ఉన్న ఫలంగా ఆపాడు. కారులో ఉన్న తన స్నేహితుడు వారిస్తున్నా దిగాడు.
ఒక్కసారిగా లేపి పక్కన పెట్టాడు
కారును రోడ్డుకు అడ్డంగా పార్క్ చేయడంతో తన వాహనం వెళ్ళదని భావించిన “టాటా హరియర్” యజమాని..ఆ కారు రెండు టైర్ల పై భాగాలను తన రెండు చేతులతో పట్టుకున్నాడు. కారును అమాంతం లేపాడు. ఒక్క ఉదుటున పక్కకు జరిపాడు. తర్వాత నవ్వు కుంటూ వచ్చి తన కారులో కూర్చున్నాడు. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు..ఆ హరియర్ లో కూర్చున్న వ్యక్తి ఆ సంఘటనను మొత్తం వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన పలువురు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ” బాహుబలి లా ఆ కారు ఎత్తావు. నువ్వు మామూలు వాడివి కాదు భయ్యా” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ” ట్రాఫిక్ క్లియరెన్స్ లో ఇది ఒక కొత్త విధానమని” మరో నెటిజన్ పేర్కొన్నాడు.
View this post on Instagram