Accident With Manhole: వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళితే రోడ్డు మీద అంతా నీరే కనిపిస్తుంది. అందులో ఎక్కడ ఏముంటుందో కూడా తెలియదు. దీంతో ప్రమాదాల బారిన పడే సూచననలు ఉన్నాయి. అందుకే వానకాలంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సిందే. మన పురపాలక సంఘం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలిసిందే. దీంతోనే పలు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. కానీ వారు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తించడం మామూలే. బాధ్యతారహితంగా ఉండటం వల్లే ప్రమాదాలు జరగడం చూస్తుంటాం. వారు మాత్రం పట్టించుకోరు. పోయేది మా ప్రాణాలు కాదు కదా అనే కోణంలోనే వారు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు వాటి గురించి పట్టించుకుంటారు అంటే సమాధానం లేదు.
ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటనను చూస్తే మనకు తెలుస్తుంది. మనం ఎంతటి నిద్రాణ వ్యవస్థలో ఉన్నామో అని. భార్యాభర్తలు స్కూటీపై వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడ ఏముందో తెలియకపోవడంతో వారు వర్షపు నీటిలోనే బండిని ముందుకు నడిపాడు. అక్కడ మ్యాన్ హోల్ ఉన్న సంగతి తెలియక అందులో పడిపోయారు. దీంతో స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. బండి మాత్రం అందులోనే ఉండిపోయింది.
Also Read: Police Viral Video: పోలీసా? మజాకా.. సినిమాల కంటే మించి రియల్ ఫైట్.. వైరల్ వీడియో..
ఇలా మన పురపాలక సంఘం తీరుతెన్నులు ఉండటం తెలిసిందే. అక్కడ కర్ర ఉంచి ఏదైనా గుర్తు పెడితే బాగుండేది కదా. అది కూడా మనమే చెప్పాలా? వారికి బాధ్యత లేదా? మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేస్తున్నట్లు? రూ. వేలు జీతాలు తీసుకుంటూ ఎవరి పనులు వారు చేయడం లేదు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ చేయని తప్పులకు మనం ఎందుకు బాధ్యులం కావాలి? మనుషుల ప్రాణాలంటే వారికి లెక్క లేనట్లుగా ఉంది.
ఆస్పత్రికి వెళ్లి వచ్చే భార్యాభర్తలు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోవడం అక్కడి సీసీ టీవీల్లో నిక్షిప్తం అయింది. దీంతో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మన మున్సిపాలిటీ బాధ్యతలను గుర్తించమని చెబుతోంది. కానీ వారికి మాత్రం ఎలాంటి పట్టింపులు ఉండవు. దీంతోనే ప్రజలు నిరంతరం ఏదో ఒక ప్రమాదానికి గురవుతూనే ఉన్నారు. మన మున్సిపాలిటీకి మాత్రం బుద్ది రాదని పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం తెలిసిందే.
Also Read:Atmakur By-election: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అబద్ధాలకు ఆధారాలు బయటపెట్టిన బీజేపీ!
Visuals from UP’s Aligarh.
Leaving this here. pic.twitter.com/bOhACL96IW
— Piyush Rai (@Benarasiyaa) June 18, 2022