https://oktelugu.com/

Chiranjeevi – RaviTeja : స్టేజి మీద రవితేజ ని చెంపదెబ్బ కొట్టిన చిరంజీవి..ఎందుకో తెలుసా? వైరల్ వీడియో

Chiranjeevi – RaviTeja : వరుసగా ‘ఆచార్య’ ,’గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ పరంగా నిరాశపర్చడంతో మెగాస్టార్ పని ఇక అయిపోయిందని చాలా మంది అనుకున్నారు..నాలుగు దశాబ్దాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన డామినేషన్ ని చూసిన కొంతమంది దురాభిమానులు చిరంజీవి డౌన్ ఫాల్ ని చూసి సంబరాలు చేసుకున్నారు..కానీ ఆ సంబరాలన్నీ కూడా మూడునాళ్ళ ముచ్చటే అని ఈ సంక్రాంతి తో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి. భారీ అంచనాల […]

Written By:
  • NARESH
  • , Updated On : January 15, 2023 / 09:55 AM IST
    Follow us on

    Chiranjeevi – RaviTeja : వరుసగా ‘ఆచార్య’ ,’గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ పరంగా నిరాశపర్చడంతో మెగాస్టార్ పని ఇక అయిపోయిందని చాలా మంది అనుకున్నారు..నాలుగు దశాబ్దాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన డామినేషన్ ని చూసిన కొంతమంది దురాభిమానులు చిరంజీవి డౌన్ ఫాల్ ని చూసి సంబరాలు చేసుకున్నారు..కానీ ఆ సంబరాలన్నీ కూడా మూడునాళ్ళ ముచ్చటే అని ఈ సంక్రాంతి తో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో నిరూపించాడు మెగాస్టార్ చిరంజీవి.

    భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీని సృష్టించింది.. మొదటి రోజు తక్కువ థియేటర్స్ లో విడుదలైనప్పటికీ కూడా ఈ చిత్రం 30 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాధించింది..ఇక రెండో రోజు అయితే స్పెషల్ మార్నింగ్ షోస్ నుండే మెగాస్టార్ తన విశ్వరూపం చూపించేసాడు.. ట్రేడ్ పండితుల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే.. ఈ సినిమా రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది.

    అంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా కి సంబంధించి సక్సెస్ మీట్ ని తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు..ఈ సక్సెస్ మీట్ కి మెగాస్టార్ చిరంజీవి తో పాటు మూవీ యూనిట్ మొత్తం హాజరైంది.. అనుకున్నట్టే ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో అందరూ మొహాలు మతాబులులాగా వెలిగిపోయాయి.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..

    ముఖ్యంగా రవితేజ తో తనకి ఉన్న అనుబంధం గురించి చిరంజీవి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రవితేజ లేకపోయి ఉంటే అంత అద్భుతమైన ఔట్ పుట్ వచ్చేది కాదు.. అతనితో ఎమోషనల్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు నేను గ్లిసరిన్ వాడలేదు.. రవితో నాకు ఉన్న అనుబంధం వల్ల ‘నా టైం అయిపోయింది అన్నయ్య’ అనగానే ఏడుపు వచ్చేసింది.. ఆ సమయంలో వాడిని దగ్గరకి తీసుకొని కొట్టాను.. సరిపోలేదు అన్నయ్యా..ఇంకా గట్టిగా కొట్టు అన్నాడు’ అంటూ రవితేజ గురించి ఎమోషనల్ మాట్లాడాడు మన మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరి అనుబంధానికి మచ్చు తునకగా లాంటి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.