Viral Video: మనదేశంలో ఎన్నో పేరు పొందిన దండకారణ్యాలు ఉన్నాయి.. ఈ అరణ్యాలలో లెక్కకు మిక్కిలి పులులు ఉన్నాయి. ఇక ఈ అడవుల్లో ప్రముఖమైనది రణతంబోర్ నేషనల్ పార్క్. ఈ పార్కులో విస్తారంగా జలాశయాలు.. అదే స్థాయిలో పులులు ఉంటాయి. అయితే ఓ పులి దాహం గా ఉండడంతో స్థానికంగా ఉన్న ఓ జలాశయం వద్దకు వెళ్ళింది. అక్కడికి వెళ్లి నీరు తాగింది. ఎండగా ఉండడంతో ఆ జలాశయంలోకి దూకింది. జలకాలాడుతుండగా ఇంతలోనే ఏదో శబ్దం వినిపించినట్టయింది. అంతే వెంటనే ఆ పులి బయటకి వచ్చేసింది. సాధారణంగానే పులి ధైర్యానికి.. ధీరత్వానికి.. తిరుగులేని పరాక్రమానికి ప్రతీక. అలాంటి పులిని భయపెట్టిందంటే కచ్చితంగా అదేదో పెద్ద జంతువే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ వీడియోలో ఉన్న జంతువును చూసి ఒక్కసారిగా నవ్వుకున్నారు. కానీ ఈ విషయం పులికి తెలియక చాలా ఇబ్బంది పడింది. చాలాసేపటి దాకా దీర్ఘంగా ఆలోచించింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పులి కూడా సైలెంట్ అయిపోయింది. అదేంటి నన్ను చూస్తే అడవి మొత్తం భయపడుతుంది. జంతు గణం కూడా వణికి పోతుంది. అలాంటి నాకు ఇంతటి భయం ఏంటి? ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరమేంటి అని? పులి తనలో తానే అనుకుంది.
రణతంబోర్ పార్కులో జలాశయాలు అధికంగా ఉంటాయి. అందులో చేపలు కూడా విస్తారంగా ఉంటాయి. వివిధ రకాల జాతులకు చెందిన చేపలు ఆ జలాశయాలలో కనువిందు చేస్తుంటాయి. ఆ పార్కులో దాహార్తి తీర్చుకోవడానికి వెళ్లిన ఓ పులి తన పనిలో నిమగ్నమై ఉండగా.. వెనుక నుంచి ఒక చేప పైకి లేచింది. అంతే వేగంతో నీటిలో పడింది. ఆ శబ్దం పులికి వినిపించడంతో వెంటనే భయంతో పరుగులు పెట్టింది. బతుకు జీవుడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. ఏ జంతువూ కనిపించకపోవడంతో అయోమయానికి గురైంది. ఆ తర్వాత ఆ ఝషం ఎగిరి పడితే తాను ఇంత దూరం పరుగులు తీసుకుంటూ వచ్చానా అంటూ తన పిరికితనానికి జాలి పడింది. ఇక ఈ వ్యవహారం మొత్తాన్ని సినీనటి సదా తన కెమెరాలో షూట్ చేశారు. ఆ వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. ఈ చేపకు ఎలాంటి అవార్డు ఇవ్వాలని ఓ పోల్ పెట్టారు. ఇప్పటివరకు ఈ పోల్ కు 1000 మంది స్పందించారు. అందరూ కూడా ఆ చేప ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. దానికి అవార్డు ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సదా తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
View this post on Instagram