Viral Video
Viral Video: ఐ ఫోన్ స్మార్ట్ ఫోన్లలో తోపు.. లాంచ్ అయి ఏళ్లు గడుస్తున్నా.. కొత్త కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంది. ధర ఎంత పెరుగుతున్నా.. వినియోగదారులు మాత్రం కొనుగోలుకు వెనుకాడడం లేదు. సంపన్నుల నుంచి హైయ్యర్ మిడిల్ క్లాస్ వరకు, యూత్ ఎక్కువగా ఐఫోన్ కొనేందుకే ఇష్టపడుతున్నారు. ఇంకా కొందరికైతే పిచ్చి ఉంటుంది. యాపిల్ నుంచి కొత్త సిరీస్ విడుదలైందంటే చాలు.. పాత ఫోన్ పక్కన పడేసి కొత్తది కొనుగోలు చేసేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఓ బిచ్చగాడు మాత్రం తన వద్ద ఉన్న చిల్లర నాణేలతో కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 ప్రో మాక్స్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు.
హైఫై స్టోర్‌కు వచ్చిన బిచ్చగాడు..
ఒంటిపై మాసిపోయిన బనియన్, కింద లుంగీతో ఓళ్లంతా మురికిగా ఉన్న ఓ బిచ్చగాడు.. రద్దీగా, హై ఫైగా ఉండే యాపిల్ స్టోర్‌కు వచ్చాడు. తన భుజానికి ఓ సంచీని వేసుకుని చూడటానికే అసహ్యం వేసేలా ఉన్నాడు. అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక.. యాపిల్ స్టోర్ సిబ్బంది, అక్కడికి వచ్చిన కస్టమర్లు ఒక రకంగా చూడటం ప్రారంభించారు. కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫోన్ కొనేందుకు తాను స్టోర్‌కు వచ్చినట్లు ఆ బిచ్చగాడు చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా మొదట అదంతా జోక్ అనుకుని లైట్ తీసుకున్నారు. రెండు స్టోర్ల సిబ్బంది అంత ఉత్త ముచ్చటే అని పంపించి వేశారు. చివరకు ఓ స్టోర్ సిబ్బంది నిజమేనా.. డబ్బులు ఉన్నాయా అని ఆరా తీశారు. దీంతో ఆ బిచ్చగాడు తన సంచీలో ఉన్న డబ్బులను అక్కడ ఓపెన్ చేసి చూపడంతో వారంతా షాక్ అయ్యారు. ఓపికగా చిల్లర నాణేలు లెక్కించి ఫోన్‌కు సరిపడా డబ్బులు తీసుకుని ఐఫోన్ 15 ప్రో అప్పగించారు. ఈ సందర్భంగా బిచ్చగాడివి ఐఫోన్ ఎందుకు అని అడిగితే తనకు ఐఫోన్ అంటే పిచ్చి అని సదరు బిచ్చగాడు చెప్పాడు.
ధనికుల ఫోన్‌గా గుర్తింపు..
ఐఫోన్ అంటే ధనికుల ఫోనే అనే మాటలు వినిపిస్తాయి. యాపిల్ ఫోన్ రిలీజ్ సమయంలో దాని రేటు రూ.లక్షకు తగ్గకుండా ఉంటుంది. అందుకే సామాన్యులు కాదు కదా మధ్యతరగతి వాళ్లు కూడా కొనడానికి చాలా కష్టమైన పని. అయితే ఇటీవల భారత మార్కెట్‌లోకి ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మాక్స్ విడుదల అయింది. యాపిల్ లవర్స్ ఎగబడి కొనుగోలు చేశారు. అయితే ఐఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఓ బిచ్చగాడు ఏకంగా మొత్తం చిల్లర నాణేలతో యాపిల్ స్టోర్‌కు వచ్చి వాటితో కొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్రాంక్ వీడియో…
అయితే ఇది ఫ్రాంక్ వీడియో అని తర్వాత తెలిసింది. కేవలం ధనవంతులకే పరిమితమైన ఫోన్‌ను బిచ్చగాడు కూడా కొనగలడని చూసేందుకే ఇలా వీడియో చేసినట్లు సదరు బిచ్చగాడు వేషధారి వెల్లడించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. యువకుడిని అభినందిస్తున్నారు.
— Dr Gill (@ikpsgill1) October 9, 2023
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Viral video a beggar came to a shop to buy an iphone with retail the owners reaction went viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com