Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షో సక్సెస్ఫుల్ గా ఆరవ వారంలో అడుగు పెట్టింది. ఈ వారం శుభశ్రీ ఎలిమినేటైన విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్ లో గౌతమ్ కూడా హౌస్ వీడాల్సింది. అయితే నాగార్జున అతడికి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్ కి పంపాడు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, పూజా మూర్తి, భోలే షావలి, నయని పావని, అశ్వినీ హౌస్లో అడుగుపెట్టారు. మరలా హౌస్ మేట్స్ సంఖ్య 14 మందికి చేరింది. సోమవారం మొదలైన ఎలిమినేషన్ ప్రక్రియ మంగళవారం ముగిసింది.
ప్రిన్స్ యావర్, అమర్ దీప్, టేస్టీ తేజా, శోభా శెట్టి, నయని పావని, పూజా మూర్తి, అశ్విని నామినేట్ అయ్యారు. సందీప్ కూడా నామినేట్ అయ్యాడు. అయితే సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణకు బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. తనకున్న పవర్ ద్వారా ఎవరైనా ఓ కంటెస్టెంట్ ని నేరుగా నామినేట్ చేయవచ్చు. లేదా నామినేషన్స్ లో కంటెస్టెంట్ ని సేవ్ చేయవచ్చు. గౌతమ్ తన స్పెషల్ పవర్ తో సందీప్ ని సేవ్ చేశాడు.
కాగా ఓటింగ్ లెక్కలు బయటకు రాగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఇప్పటి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో పరిశీలిస్తే… ప్రిన్స్ యావర్ అందరికంటే అత్యధిక శాతం ఓట్లు రాబట్టాడట. అతనికి ఏకంగా 40 శాతం ఓట్లు పడ్డాయని సమాచారం. యావర్ తర్వాత రెండో స్థానంలో అమర్ దీప్ 20 శాతం ఓట్లతో కొనసాగుతున్నాడట. ఇక 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో తేజా, 10 శాతం ఓట్లతో అశ్విని, 8 శాతం ఓట్లతో నయని పావని తర్వాత స్థానాల్లో ఉన్నారట.
పూజా మూర్తి-శోభా శెట్టిలకు కేవలం చెరో 5 శాతం ఓట్లు పడ్డాయట. కాబట్టి పావని, పూజా మూర్తి, శోభా శెట్టి డేంజర్ జోన్లో ఉన్నారట. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. మరి అదే జరిగితే హౌస్ని వీడే ఆరో కంటెస్టెంట్ కూడా అమ్మాయే అవుతుంది. ఇప్పటికే వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ ఎలిమినేటైన విషయం తెలిసిందే.