Viral Selfie Incident: ఏ ముహూర్తంలో అయితే ఇండోర్ ప్రాంతానికి చెందిన రఘువంశీని అతడి భార్య తన ప్రేమికుడు, ఇతరులతో కలిసి అంతం చేసిందో.. మేఘాలయలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో.. అప్పటినుంచి దేశంలో ఏదో ఒకచోట భర్తలు భార్యల చేతిలో హతమవుతున్నారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అధ్యంతం సినిమాను తలపించే విధంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఫలితంగా మీడియాలో.. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. కేవలం చనిపోయిన ఘటనలు మాత్రమే కాకుండా.. చంపడానికి ప్రయత్నించే ఘటనలు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా భర్తలను హతం చేసిన కేసులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాన్ని మర్చిపోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో జరిగిన దారుణం కూడా కలకలం సృష్టించింది.
ఇలాంటి దారుణాలు జరిగిన తర్వాత చాలామంది యువకులు వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. వివాహాలు చేసుకున్నప్పటికీ.. ఎక్కడ తమను అంతం చేస్తారేమోననే భయంతో హనీమూన్ కూడా వెళ్లడం లేదు. ఇటీవల ఓ యువకుడు తన భార్యతో హనీమూన్ వెళ్ళడానికి ప్రయత్నించగా.. ఆమె తన ప్రియుడుతో కలిసి పారిపోయింది. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా చేరుకుంది. చివరగా తన భార్య వ్యవహారం తెలియడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు.. అంతేకాదు హనీమూన్ వెళ్లకుండా తాను ఉండిపోవడం మంచిదైందని భావించాడు. ఇటువంటి ఘటనలు జరుగుతున్న ప్రస్తుత క్రమంలో.. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది.
కర్ణాటకలోని రాయచూరు ప్రాంతంలో ఉన్న ఓ నది ఇటీవల కురిసిన వర్షాలకు విస్తారంగా ప్రవహిస్తోంది. ఆ సన్నివేశం చూపరులను కట్టిపడేస్తోంది. ప్రవహిస్తున్న నదిని చూసేందుకు వెళ్దామని ఓ భార్య తన భర్తను అడిగింది. దానికి అతడు ఓకే చెప్పాడు. దీంతో వారిద్దరు ఆ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుందామని తన భర్తను ఆమె కోరింది. దానికి అతడు ఓకే అన్నాడు. ఈ క్రమంలోనే సెల్ఫీ తీసుకుంటూ ఉండగా వెంటనే ఆమె అతడిని నదిలోకి తోసింది . నది ప్రవాహం విపరీతంగా ఉండడంతో అతడు అలానే కొట్టుకుపోయాడు. చివరికి ఒక బండరాయికి అడ్డు తగిలి ఆగిపోయాడు. తనను కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు ఒక పెద్ద తాడు తీసుకొచ్చి అతడిని నదిలో నుంచి బయటికి తీసుకొచ్చారు.. ఆ తర్వాత ఎందుకు నువ్వు దూకావని స్థానికులు అడిగితే.. “నేను నదిలో దూకలేదు.. నా భార్య అందులో తోసి వేసిందని” ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. దీంతో గ్రామస్తులు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ముందుగా అతడిని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించిన తర్వాత పోలీసులు అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు అతడి భార్యను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు.
సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తను నదిలోకి తోసి చంపాలనుకున్న భార్య
నదిలో కొట్టుకుపోతూ రాయి వద్ద చిక్కుకున్న భర్త.. తాడు సహాయంతో కాపాడిన స్థానికులు
కర్ణాటక రాయచూర్‌లో నదిపైన ఉన్న వంతెన వద్ద సెల్ఫీ తీసుకుందామని భర్తను కోరిన భార్య
సెల్ఫీ తీసుకుంటుండగా భర్తను నదిలోకి తోసేసిన భార్య… pic.twitter.com/HBL8IQuTmz
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2025