కాలం మారుతోంది. పోటీ తత్వం పెరుగుతోంది. విభిన్నంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో మనం కూడా మారాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. పోటీ ప్రపంచంలో మనల్ని గుర్తించాలంటే మనం ఏదో రకంగా కొత్తదనం ప్రదర్శించాలి. పాత చింతకాయ పచ్చడి ఎవరు చూస్తారు. అందుకే నాగరికత ప్రపంచంలో నవ్యతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరికొత్త విధానాలతో రిపోర్టింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారిని మన వైపు తిప్పుకునే క్రమంలో సృజనాత్మకత ఆవిష్కరించాలి.
తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఓ రిపోర్టర్ గేదెను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అతడు గేదెను పలు ప్రశ్నలు అడిగాడు. దీనికి ఆ గేదె అరుపులతో సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ జర్నలిస్ట్ అమిన్ హఫీజ్ లాహోర్ లోని ఒక గేదెను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. పలు ప్రశ్నలు సంధించాడు. దీంతో ఆ గేదె అరుపులను సమాధానాలుగా స్వీకరించి వాటికి క్లారిటీ ఇచ్చాడు.
గేదెను పలు రకాల ప్రశ్నలు అడిగాడు. లాహోర్ లో ఉండడం ఎలా అనిపిస్తుంది అని అడిగాడు. ఆహారం బాగుందా అని ప్రశ్నించాడు. దీంతో గేదె పెద్దగా అరవడంతో గేదె స్పందన బాగుందని సమాధానం చెప్పిందని సూచించాడు. గేదె జీవితంపై ఇలా ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తనలోని వెరైటీ ఆలోచనకు ఆచరణలో పెట్టి వైవిధ్యాన్నిప్రదర్శించాడు.
దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. గేదెను ఇంటర్వ్యూ చేయడం కొత్తగా ఉందని చెబుతున్నారు. గేదె జీవితాన్ని కూడా చూపించడం కొత్తదనానికి శ్రీకారం చుట్టినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం గేదె కూడా ముచ్చటిస్తున్నట్లు చూపించడంతో అందరు నవ్వుకుంటున్నారు.
Now what is Eid without Amin Hafeez interviewing cattle.. pic.twitter.com/5r2sfh5Ua7
— Naila Inayat (@nailainayat) July 21, 2021
