
మామూలుగానే సోషల్ మీడియాలో నెటిజన్లు అంటే సృజనశీలురు.. ఆఖరుకు మోడీ కరోనా ఇబ్బందులను తలుచుకొని కన్నీరు కారిస్తే కూడా దానిపైన మీమ్స్, సెటైర్లు వేసిన మహానుభావులు. అంతటి క్రియేటివిటీ గల నెటిజన్లకు ఓ హీరోయిన్ కంటి బుల్లితెర నటి ఓ ఆఫర్ ఇచ్చింది.. ‘నన్ను పైకి తీసుకెళ్లండి’.. ఎత్తి పడేయండి అంటూ బంపర్ ఆఫర్ ను సోషల్ మీడియాలో ఇచ్చింది. ఇకేం నెటిజన్లు ఊరుకుంటారా? రచ్చ రచ్చ చేసేశారు. ఆమె ఫొటోతో మీమ్స్, సెటైర్లు హోరెత్తించారు.
తాజాగా ఓ ఇంటి మేడ మీద ఫ్లోర్ పై ఆహ్లాదంగా కూర్చున్న తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నటి పవిత్రలక్ష్మీ. ఈమె ‘ఉల్లాసం’ అనే మలయాళ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది. ‘కూకూ విత్ కోమలి’ అనే షోతో బుల్లితెరపై పవిత్రలక్ష్మీ ఫేమస్ అయ్యింది. పలు షార్ట్ ఫిలింలలో నటించింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటోంది.
తను కూర్చున్న ఫొటోను షేర్ చేసి నెటిజన్లకు సవాల్ చేసిన నటి పవిత్రకు దిమ్మదిరిగేలా మీమ్స్ రూపొందించి షాక్ ఇచ్చారు నెటిజన్లు. కొందరు కూలీలు బియ్యం బస్తాను మోసినట్టుగా పవిత్రను ఎత్తి పడేసినట్టు.. ఓ టవర్ నుంచి హీరో ఎత్తి పవిత్రను కిందవేసినట్టు.. గాల్లో ఎగురుతున్న టాటా సుమోపైన పవిత్రను కూర్చోబెట్టినట్టు ఇలా రకరకాలుగా మీమ్స్ చేసి హీరోయిన్ కు షాకిచ్చారు.
అయితే వాటన్నింటిని చూసుకొని నవ్విన పవిత్రలక్ష్మీ నెటిజన్ల క్రియేటివిటీ సూపర్ అంటూ వాటన్నింటిని షేర్ చేసి ఓ నవ్వు నవ్వుకుంది.
https://twitter.com/pavithralaksh_/status/1402193008942931968?s=20