Viral video : కానీ కొన్ని సందర్భాల్లో పెద్దలు కూడా కట్టుతప్పుతుంటారు. పిల్లల మధ్య జరిగిన గొడవలు అనవసరంగా వేలు పెట్టి దానిని వారి మధ్య కొట్లాట దాకా తీసుకెళ్తారు. సహజంగా ఇలాంటి సంఘటనలు మనదేశంలో ఎక్కువగా చోటుచేసుకుంటాయి. అయితే ఇప్పుడు విదేశాలలో కూడా మనకంటే ఎక్కువగా కొట్లాటలు చోటు చేసుకుంటున్నాయి. అభివృద్ధికి మారుపేరుగా.. డాలర్ల దేశంగా పేరుపొందిన శ్వేత దేశంలో పెద్దల మధ్య కొట్లాటలు జరుగుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఈ తరహా విషయాలు త్వరగా వెలుగులోకి వస్తున్నాయి. శ్వేత దేశంలోని ఆర్కాన్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన పెద్దల మధ్య జరిగిన కొట్లాట పెను సంచలనానికి దారి తీసింది.
ఆర్కాన్సస్ ఓ ఎలిమెంటరీ స్కూల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ చిన్నారుల తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. అది కాస్త వారి మధ్య ముష్టి ఘాతాలకు కారణమైంది. తల్లిదండ్రులు ఎంతసేపటికీ ఆ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టకపోవడంతో అది అంతకంతకూ పెరిగింది. ముందుగా అక్కడ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు భారీగా వచ్చారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత చిన్నారులకు మిఠాయిలు, ఇతర తినుబండారాలు తినిపించారు. ఆ తర్వాత ఆహారం తినే విషయంలో పెద్దల మధ్య చిన్నపాటి చర్చ మొదలైంది. ఆ తర్వాత అది గొడవగా మారింది. అనంతరం వారంతా ముష్టి ఘాతాలకు పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టుకున్నారు.
ముందుగా మహిళలు ఒకరినొకరు ఘోరంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత తీవ్రంగా కొట్టుకున్నారు. వారి మధ్య గొడవను సద్దు మణిగించడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే పురుషుల మధ్య కూడా గొడవ జరిగింది. వారు కూడా తీవ్రంగా కొట్టుకున్నారు. మొత్తంగా ఈ సంఘటన సామాజిక మాధ్యమాలలో తీవ్రంగా చర్చకు దారి తీసింది.. ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని వెస్ట్ మెంఫిస్ నగరంలోని పాల్కి ఎలిమెంటరీ స్కూల్లో మే 28న గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. చిన్నారులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన గొడవ ఈ స్థాయికి దారితీసింది. అయితే దీనిపై స్కూల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొంది. “ఇదంతా చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. పిల్లల వేడుకకు హాజరైన పెద్దలు కొట్టుకోవడమేమిటో అర్థం కావడం లేదు. పిల్లలకు ఉన్న స్పృహ పెద్దలకు లేకపోవడం నిజంగా ఆవేదన కలిగిస్తోంది. స్టూడెంట్స్ కాదు.. ముందు పెద్దలు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉందని” సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.. పెద్దలు తమ తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.
అమెరికా స్కూల్లో.. తల్లిదండ్రుల ముష్టిఘాతాలు!#usschools #usa #viralvídeo #americasschools #latestnews #andhraprabha #andhraprabhanews pic.twitter.com/ui9gmzRaR3
— Andhra Prabha News (@andhraprabha_) May 31, 2025