
Vinaro Bhagyamu Vishnu Katha Trailer: రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ. టైటిల్ డిఫరెంట్ గా ట్రై చేసి యూనిట్ ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూశాక కాన్సెప్ట్ ఇంకా డిఫరెంట్ గా ఉందని అర్థమైంది. వినరో భాగ్యము విష్ణు కథ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా… ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక నిర్మాతలతో పాటు హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూవీ విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వినరో భాగ్యము విష్ణు కథ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీకి హై వోల్టేజ్ యాక్షన్ జత చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ మెయిన్ ప్లాట్ చాలా కొత్తగా రాసుకున్నారు. నెంబర్ నైబర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు. ప్రతి ఫోన్ నెంబర్ కి ఒక్క నెంబర్ తేడాతో రెండు నంబర్స్ ఉంటాయి. అంటే నంబర్ మొత్తం సేమ్. ఒక్క నంబర్ తేడాతో ఇద్దరు ఉంటారు. నా ఫోన్ నెంబర్ లాస్ట్ డిజిట్ 5 అనుకుంటే 4,6 నెంబర్స్ కలిగిన వారు నా నెంబర్ నైబర్స్ అవుతారన్న మాట.
పక్కింటి వాళ్లతో ఎలా సన్నిహితంగా ఉంటామో, సాధక బాధలు పంచుకుంటామో… నెంబర్ నైబర్స్ తో కూడా స్నేహం చేయాలంటుంది ఈ చిత్ర హీరోయిన్. అలా హీరోయిన్ నెంబర్ నైబర్స్ గా కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ ఉంటారు. ముక్కూ ముఖం తెలియని వారిద్దరికీ ఫోన్ చేసి ఫ్రెండ్స్ చేసుకుంటుంది హీరోయిన్. అనుకోని అతిథి గా తన జీవితంలోకి వచ్చిన అందమైన అమ్మాయి పట్ల హీరో ఆకర్షితుడు అవుతాడు. ట్విస్ట్ ఏంటంటే ఏజ్ బార్ మురళీ శర్మకు హీరోయిన్ ఇష్టపడతాడు. హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడం కోసం కిరణ్ అబ్బవరం, మురళీ శర్మల టామ్ అండ్ జర్రీ వార్ వినరో భాగ్యము విష్ణు కథలో ఫుల్ ఫన్ పంచడం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే కిరణ్ అబ్బవరం నెంబర్ నైబర్స్ లో ఒకరు హీరోయిన్ అయితే మరొకరు విలన్ శరత్ కుమార్. అతనితో కిరణ్ అబ్బవరంకి లొల్లి ఏందీ? హీరోయిన్ కి వచ్చిన ఇబ్బంది ఏందీ? ఈ నెంబర్ నైబర్స్ కథ ఎలా ముగిసింది? అనేది వినరో భాగ్యము విష్ణు కథ స్టోరీ అని ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. ట్రైలర్ చూశాక నిజంగా మన నెంబర్ నైబర్స్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి కలగమానదు. మనకు ఇంత వరకూ తెలియని ఈ విషయం అంత ఇంట్రెస్ట్ కలిగించింది. కాశ్మీరా హీరోయిన్ గా నటించగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న విడుదల కానుంది.