Vinaro Bhagyamu Vishnu Katha : ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది

రీసెంట్ గా విడుదలై మంచి రివ్యూస్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’.యంగ్ హీరో కిరణ్ సబ్బవరం కి ‘SR కల్యాణ మండపం’ సినిమా తర్వాత మరో మంచి కమర్షియల్ హిట్ గా నిల్చిన సినిమా ఇది.గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ రెండు కోట్ల రూపాయలకు జరిగింది. క్లోసింగ్ కలెక్షన్స్ దాదాపుగా 7 […]

Written By: NARESH, Updated On : March 16, 2023 9:16 pm
Follow us on

రీసెంట్ గా విడుదలై మంచి రివ్యూస్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’.యంగ్ హీరో కిరణ్ సబ్బవరం కి ‘SR కల్యాణ మండపం’ సినిమా తర్వాత మరో మంచి కమర్షియల్ హిట్ గా నిల్చిన సినిమా ఇది.గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ రెండు కోట్ల రూపాయలకు జరిగింది.

క్లోసింగ్ కలెక్షన్స్ దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది.వరుస ఫ్లాప్స్ లో ఉన్న గీత ఆర్ట్స్ కి కూడా ఈ సినిమా మంచి సూపర్ హిట్ గా నిల్చింది.థియేట్రికల్ పరంగా కమర్షియల్ గా ఇంత సూపర్ హిట్ అయినా ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.అలా ఎదురు చూసే ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఒక శుభవార్త.

ఈ సినిమాని ఈ నెల 22వ తారీఖున ఆహా యాప్ లో విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలం లో ఇలాంటి చిన్న సినిమాలను ఒక సెక్షన్ ఆడియన్స్ థియేటర్స్ లో చూడడం ఆపేసారు.ఓటీటీ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అలా ఈ సినిమా విడుదల కోసం కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు ఆడియన్స్.థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో కిరణ్ అబ్బవరం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ పై సంతకాలు చేస్తూనే ఉన్నాడు.ఆయన కొత్త చిత్రం ‘మీటర్’ కి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది, ఈ సినిమాతో పాటుగా మరో అరడజను సినిమాలు క్రేజీ ప్రొడక్షన్ హౌస్లతో చెయ్యబోతున్నాడు.