https://oktelugu.com/

Vinaro Bhagyamu Vishnu Katha Review: ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ ఫుల్ రివ్యూ

Vinaro Bhagyamu Vishnu Katha Review: నటీనటులు : కిరణ్ అబ్బవరం, కాశ్మిరీ పరదేశి, మురళీ శర్మ,శుభలేఖ సుధాకర్, ప్రవీణ్ తదితరులు బ్యానర్ : గీతా ఆర్ట్స్ నిర్మాతలు : బన్నీ వాసు డైరెక్టర్ : మురళీ కిషోర్ మ్యూజిక్ డైరెక్టర్ : చైతన్ భరద్వాజ్ ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ కి పరిచయమైనా కొత్త హీరోలలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం.మొదటి సినిమా ‘రాజా వారు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2023 / 08:29 AM IST
    Follow us on

    Vinaro Bhagyamu Vishnu Katha Review

    Vinaro Bhagyamu Vishnu Katha Review: నటీనటులు : కిరణ్ అబ్బవరం, కాశ్మిరీ పరదేశి, మురళీ శర్మ,శుభలేఖ సుధాకర్, ప్రవీణ్ తదితరులు

    బ్యానర్ : గీతా ఆర్ట్స్
    నిర్మాతలు : బన్నీ వాసు
    డైరెక్టర్ : మురళీ కిషోర్
    మ్యూజిక్ డైరెక్టర్ : చైతన్ భరద్వాజ్

    ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ కి పరిచయమైనా కొత్త హీరోలలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం.మొదటి సినిమా ‘రాజా వారు రాణి వారు’ అనే సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, నటుడిగా కిరణ్ అబ్బవరం కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇక రెండవ సినిమా ‘SR కల్యాణమండపం’ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి లైంలైట్ లోకి వచ్చాడు.ఆ తర్వాత ఆయన చేసిన ‘సెబాస్టియన్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ,ఆ తర్వాత వచ్చిన ‘సమ్మతమే’ అనే చిత్రం ద్వారా మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఈసారి కొడితే బలంగా కొట్టి స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవాలి అనే కసితో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే చిత్రం ద్వారా ఈరోజు మన ముందుకొచ్చాడు.ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

    కథ :

    చిన్నతనం లోనే తల్లితండ్రులను కోల్పోయి అనాధాశ్రమం లో పెరిగిన విష్ణు(కిరణ్ అబ్బవరం), పెద్దయ్యాక ఒక లైబ్రరీ లో పనిచేస్తూ ఉంటాడు.తనకి ఉన్న మంచితనం నలుగురికి ఉపయోగపడాలి అనే మనస్తత్వం గలవాడు విష్ణు.అలాంటి వ్యక్తి జీవితం లోకి నెంబర్ నైబరింగ్ ఐడియా తో రాంగ్ కాల్ ద్వారా దర్శన (కాశ్మిరీ పరదేశి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది.అదే నెంబర్ నైబరింగ్ ఐడియాతో శర్మ (మురళీ శర్మ) అనే వ్యక్తి తో కూడా రాంగ్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి పరిచయం పెంచుకుంటుంది.అలా వీళ్ళిద్దరితో కలిసి వీడియోలు చేసి, యూట్యూబ్ లో అప్లోడ్ చేసి బాగా పాపులర్ అవ్వాలనుకుంటుంది దర్శన..ఈ క్రమం లోనే విష్ణు తో ప్రేమలో పడుతుంది.అయితే ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసిన వ్యూస్ రావట్లేదని,ఈసారి లైవ్ మర్డర్ ప్రాంక్ ప్లాన్ చేసి, ఆ వీడియో ని యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది దర్శన.కానీ అనుకోకుండా ఆ ప్రాంక్ కాస్త నిజమై శర్మ ని మర్డర్ చేస్తుంది.దీనితో దర్శన కి 7 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది.ఇదంతా కుట్ర పూరితంగా చేసారని గమనించిన విష్ణు ఆమెని ఎలా అయినా నిర్దోషి గా బయటకి తీసుకొని రావాలని చేసే ప్రయత్నమే మిగిలిన సినిమా.

    Vinaro Bhagyamu Vishnu Katha Review

    విశ్లేషణ :

    ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదు.అలాంటి సరికొత్త కథాంశం ని ఎంచుకొని ఎంటర్టైన్మెంట్ , ఎమోషన్స్ ఎక్కడ మిస్ కాకుండా డైరెక్టర్ మురళీ కిషోర్ చాలా చక్కగా తెరకెక్కించాడు.ఫస్ట్ హాఫ్ మొత్తం వినోదం తో ప్రేక్షకులకు పొట్టచెక్కలు అయ్యేలా చేస్తుంది.ముఖ్యంగా హీరోయిన్ మరియు మురళీ శర్మ యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యడం కోసం చేసే వీడియోలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.మధ్యలో కొన్ని సన్నివేశాలు కథకి అడ్డం పడినట్టు అనిపించినప్పటికీ ఫస్ట్ హాఫ్ మొత్తం టైం పాస్ అయిపోతుంది.ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేస్తాది.సెకండ్ హాఫ్ కి మంచి సెటప్ చేసుకున్న డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే వినోదం కాస్త తగ్గడం తో అక్కడక్కడా బోర్ కొడుతాది కానీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మరో ట్విస్ట్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది.

    ఇక నటీనటుల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఎప్పటిలాగానే ఈ సినిమాలో బాగా చేసాడు కానీ, ఈ చిత్రం లో మరింత బాగా చేసాడు.ముఖ్యంగా కామెడీ టైమింగ్ లో ,మరియు హీరోయిజమ్ పలికించడం లో బాగా ఇంప్రూవ్ అయ్యాడు.ఇక మురళీ శర్మ అయితే ఈ సినిమా లో తన నట విశ్వరూపం చూపించేసాడు.హీరోయిన్ కాశ్మీరీ పరదేశి కూడా చూడడానికి అందంగా ఉంటూనే అద్భుతంగా నటించి సినిమాకి ఆయువుపట్టులాగా నిల్చింది.

    చివరి మాట : ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ట్విస్టులతో నిండిపోయిన ఈ సినిమా ఆడియన్స్ కి విందు భోజనం లాగా అనిపిస్తాది.ఈ వీకెండ్ కి మరో మంచి సినిమా వచ్చేసింది, థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి.

    రేటింగ్ : 2.75 /5

    Tags