‘Vinaro Bhagyamu Vishnu Katha’ Closing Collections : సరైన హిట్టు కొసం ఎదురు చూస్తున్న కుర్ర హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గానే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.కేవలం కిరణ్ అబ్బవరం కి మాత్రమే కాదు, గీత ఆర్ట్స్ కి కూడా చాలా కాలం తర్వాత ఈ చిత్రం రూపంలో ఒక హిట్ తగిలింది.ఈ సినిమాకి ముందు ఈ బ్యానర్ నుండి వచ్చిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
‘ప్రతి రోజు పండగే’ చిత్రమే ఈ బ్యానర్ నుండి వచ్చిన చివరి హిట్.మళ్ళీ ఇప్పుడు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తో ట్రాక్ లోకి వచ్చారు.ఈ సినిమా విడుదలైన ఒక రోజుకి ముందు ధనుష్ ‘సార్’ మూవీ విడుదలై, అది కూడా సూపర్ హిట్ అవ్వడం తో కలెక్షన్స్ మీద కాస్త ప్రభావం పడినమాట నిజమే కానీ,ఫుల్ రన్ లో మాత్రం కమర్షియల్ హిట్ గా నిల్చింది.
సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిలు మాత్రమేనట.ఫుల్ రన్ లో అన్ని సెంటర్స్ లెక్క తీస్తే 5 కోట్ల 60 లక్షల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చిందట.అంటే బయ్యర్స్ కి కోటి 10 లక్షల రూపాయిల లాభాలు అన్నమాట.ఒకవేళ సార్ సినిమాతో పోటీగా వచ్చి ఉండకపొయ్యుంటే కచ్చితంగా ఈ సినిమా ఫుల్ రన్ లో పది కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి ఉండేదని, హిట్ గా కాకుండా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేది అంటున్నారు విశ్లేషకులు.
ఇక కిరణ్ అబ్బవరం తర్వాతి లెవల్ కి వెళ్లే హిట్ సినిమా కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.ప్రస్తుతానికి ఆయన సినిమాల షేర్స్ 10 కోట్ల రూపాయిల లోపే ముగిసిపోతుంది.ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా అంతే జరుగుతుంది.ఇలా ఆయన సినిమాలు ఇంకెంత కాలం సింగల్ డిజిట్ షేర్స్ కి మాత్రమే పరిమితం అవుతుందో చూడాలి.