
Vinaro Bhagyamu Vishnu Katha Collections: యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కుర్ర హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం.’రాజా వారు రాణి వారు’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమైన కిరణ్ ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’ సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కెరీర్ లో నిలదొక్కుకున్నాడు.ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ కిరణ్ అబ్బవరం కి నటుడిగా మంచి పేరే తెచ్చిపెట్టాయి.
అలా కెరీర్ లో సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్ అబ్బవరం కి రీసెంట్ గా విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే చిత్రం సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని, డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచింది.ఇప్పటికే విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
మొదటి రోజు ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ నుండి వచ్చిన వసూళ్లను కలిపి చూస్తే దాదాపుగా కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు.రెండవ రోజు కూడా ఈ సినిమాకి కోటి 23 లక్షల రూపాయిలు వచ్చాయి.అలా రెండు రోజులకు కలిపి 2 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా 44 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టి మూడు రోజుల్లో మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన సినిమాగా నిలిచింది.

ఇక నాల్గవ రోజు కూడా డీసెంట్ హోల్డ్ ఉండడం తో ఈరోజు మరో 35 లక్షల రూపాయిల షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అలా నాలుగు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వచ్చేసింది.మరి ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.