‘Vinaro Bhagyamu Vishnu Katha’ collections : ‘వినరో భాగ్యము విష్ణు కథ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి అతిచేరువలో..!

‘Vinaro Bhagyamu Vishnu Katha’ collections : ఇటీవల కాలంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతమంది కుర్ర హీరోలలో యూత్ ని బాగా ఆకర్షించిన హీరో కిరణ్ అబ్బవరం. ‘SR కల్యాణమండపం’ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి లైం లైట్ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో లెవెల్ కి వెళ్ళడానికి సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన గత రెండు చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో […]

Written By: NARESH, Updated On : February 20, 2023 1:39 pm
Follow us on

‘Vinaro Bhagyamu Vishnu Katha’ collections : ఇటీవల కాలంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతమంది కుర్ర హీరోలలో యూత్ ని బాగా ఆకర్షించిన హీరో కిరణ్ అబ్బవరం. ‘SR కల్యాణమండపం’ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి లైం లైట్ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో లెవెల్ కి వెళ్ళడానికి సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన గత రెండు చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

దీంతో ఆయన ఈసారి వచ్చే సినిమాతో ఎలా అయినా వేరే లెవెల్ కి వెళ్లే హిట్ కొట్టాలనే కసితో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఆయన ఊహించిన రేంజ్ రెస్పాన్స్ అయితే రాలేదు కానీ, ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా త్వరలోనే నిలబడబోతుంది అని మాత్రం చెప్పొచ్చు. రెండు రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసుకుందాం.

‘సార్’ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ పడినట్టు గానే, ఈ సినిమాకి కూడా కొన్ని ప్రాంతాలలో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ దక్కింది. అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి మొదటి రోజు కోటి 25 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రెండవ రోజు మొదటి రోజుకంటే ఎక్కువగా కోటి 50 లక్షల రూపాయిలను రాబట్టింది సమాచారం.

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగిందట. మొదటి రెండు రోజులకు కలిపి మూడు కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమాని శుక్రవారం రోజు విడుదల చేసి ఉంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి రేపటి నుండి ఈ సినిమా డీసెంట్ హోల్డ్ ని కనబరుస్తుందా లేదా అనేది చూడాలి.