Varasudu Movie Release Postponed: మన టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తమిళనాడు స్టార్ హీరో విజయ్ తో ‘వారిసు’ అనే చిత్రం తీసాడు..ఈ సినిమాని తెలుగు లో ‘వారసుడు’ పేరు తో అనువదించి ఈ నెల 12 వ తేదీన తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల చెయ్యాలనుకున్నాడు..దిల్ రాజు కి థియేటర్స్ బాగా ఉన్న సంగతి తెలిసిందే..ఈ సంక్రాంతి కి విడుదల అవుతున్న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకంటే ఎక్కువ థియేటర్స్ ని హోల్డ్ చెయ్యడం తో విమర్శలు చాలా తీవ్ర స్థాయిలో వచ్చాయి.

అభిమానులందరూ ఈ సినిమా ఆగిపోవాలని బలంగా కోరుకున్నారు..వాళ్ళ కోరికకి తధాస్తు దేవతలు తధాస్తు అన్నట్టు ఈ చిత్రం తెలుగు వెర్షన్ వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు ఈ సందర్భంగా తెలిపాడు..ఆయన తెలుగు సినిమాలకు గౌరవం ఇచ్చి వెనక్కి తప్పుకున్నాడు అని మీరు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు.
తెలుగు వెర్షన్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాగా మిగిలిపోవడం వల్లే ఆయన విడుదల వాయిదా వేసాడు..త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు..జనవరి 13 వ తేదీ మరియు 14 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది..అయితే దిల్ రాజు ఈ చిత్రాన్ని ముందుగా జనవరి 12 వ తేదీన విడుదల చెయ్యాలనుకున్నాడు..కానీ పోటీ గా మరో తమిళ స్టార్ హీరో అజిత్ కూడా ఉండడం తో థియేటర్స్ తక్కువ దొరుకుతున్నాయి.

అందుకే ఈ సినిమాని ఒకరోజు ముందుగా..అనగా జనవరి 11 వ తేదీన విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు..త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో..ఆయనకి థియేటర్స్ కొద్దిగా ఎక్కువ కావాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..ఈ నేపథ్యం లోనే ఎక్కువ థియేటర్స్ కోసం ఒక రోజు ముందుకి వెళ్తున్నట్టు తెలుస్తుంది.